ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పునఃప్రారంభాల ఎమ్మెల్యేగా నవ్వులపాలు కావొద్దు

ABN, First Publish Date - 2022-01-23T05:04:13+05:30

ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకోవాలని ప్రారంభించిన పనులకు తిరిగి ప్రారంభోత్సవాలు చేస్తూ పునఃప్రారంభాల ఎమ్మెల్యేగా నవ్వులపాలు కావద్దంటూ మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి హితవు పలికారు.

విలేకరులతో మాట్లాడుతున ్న మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి దేవగుడి హితవు

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 22: ప్రజలకు ఉపయోగపడే  పనులు చేసి ఎమ్మెల్యేగా  మంచి పేరు తెచ్చుకోవాలని ప్రారంభించిన పనులకు తిరిగి ప్రారంభోత్సవాలు చేస్తూ పునఃప్రారంభాల ఎమ్మెల్యేగా నవ్వులపాలు కావద్దంటూ మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి హితవు పలికారు. శనివారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమ్మలమడుగు నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని సూచించారు.  ఇంతవరకు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగలేదన్నారు. గండికోట ముంపు గ్రామాల ప్రజలు వర్షాకాలంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నివసించారన్నారు.  సమస్యలు  పట్టించుకోకుండా  పాత పనులు, ప్రారంభం చేసినవాటికే ప్రారంభాలు చేసుకుంటూ పోవడం సరికాదన్నారు. గత నెలలో పులివెందులలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెద్దముడియం పోలీసు స్టేషన్‌ను ప్రారంభిస్తే ఆ స్టేషన్‌ ఎమ్మెల్యే ఇటీవల మళ్లీ ప్రారంభించడంతో ముఖ్యమంత్రికే గౌరవంలేదని ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. జమ్మలమడుగు పట్టణంలోపాత దుకాణాలు స్థలం మార్చినా ప్రారంభోత్సవాలు చేస్తున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నవ్వులపాలు కాకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.  ఈకార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్‌రాయల్‌, పొన్నతోట శ్రీనివాసులు, జింకల మహబూబ్‌ బాష, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T05:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising