ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు సొగసు చూడతరమా..!

ABN, First Publish Date - 2022-01-21T04:52:50+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠం రోడ్డంతా గుంతలు, మిట్టలుగా మారి ప్రయాణం నరకయాతకంగా మారింది.

బద్వేలు-బి.మఠం రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బద్వేలు-బ్రహ్మంగారిమఠం వెళ్లాలంటే నరకయాతన

పర్యాటక కేంద్రమైనా పట్టించుకోని దుస్థితి

 ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికుల అవస్థలు 

బద్వేలు, జనవరి20: ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠం  రోడ్డంతా గుంతలు, మిట్టలుగా మారి ప్రయాణం నరకయాతకంగా మారింది. నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు రోడ్డంతా తారు లేచిపోయి అనేక చోట్ల మట్టి రోడ్డు తేలింది. దీంతో కొన్ని చోట్ల నడిరోడ్డుపైనే వాహనాలు ఇరుక్కుపోతున్నాయి. బద్వేలు-బి.మఠం రోడ్డులోనే మలుగుడు పాడు నుంచి బ్రహ్మంగా రిమఠం వరకు దాదాపు 14 కి.మీ. ఇదే తీరుగా ఉంది. ఈ రోడ్డులో బద్వేలు, బి.మఠం ఆర్టీసీ బస్సులతోపాటు వందలాది ప్రైవేటు వాహనాలు నిత్యం తిరుగుతుంటాయి. రోడ్డులో ద్విచ్రవాహనాలు, ప్రయాణం మరింత కష్టంగా తయారైంది. బ్రహ్మంగారి మఠం నుంచి బద్వేలుకు నిత్యావసరాల కోసం  మండల కేంద్రంలో పను ల కోసం ఈ ప్రాంత వాసులు రోజూ ప్రయాణిస్తూ  రద్దీగా ఉండే ఈ రోడ్డు  రూపురేఖలే కనిపించనంత దారుణంగా తయారైంది.  నెల్లూరు, చిత్తూరు జిల్లాల  తూర్పు ప్రాంతం చెన్నై, తమిళనాడు ప్రాంతం నుంచి బ్రహ్మంగారిమఠం నుంచి వచ్చే భక్తులు కూడా ఈ దారిలోనే చేరుకోవాల్సి ఉంది. ఇంత ప్రాధాన్యమున్న ఈ రహదారిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వలన ఈ ప్రాంత వాసులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. 

తక్షణమే మరమ్మతులు చేపట్టాలి: బద్వేలు-బ్రహ్మంగారిమఠం రహదారి మరమ్మతులు వెంటనే చేపట్టాలని స్థానిక ప్రజలతో పాటు వాహనదారులు కోరుతున్నారు. గుంతలమయంగా మారి కంకర రాళ్లుపైకి తేలడంతో రోడ్డు దుస్థితి అద్వాన్నంగా ఉంది .  

మరమ్మతులకు ప్రతిపాదనలు:బద్వేలు-బ్రహ్మంగారిమఠం  14 కి.మీ. ప్రధాన రహదారి  మరమ్మతులకు రూ.14 లక్షలతో ప్రతిపా దనలు పంపామని ఆర్‌అండ్‌బీ ఏఈ దస్తగిరి తెలిపారు. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-01-21T04:52:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising