ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య మిత్రలను నెట్‌వర్క్‌కు బదలాయించవద్దు

ABN, First Publish Date - 2022-08-12T05:27:06+05:30

ఆరోగ్య మిత్రలను నెట్‌వర్క్‌కు బదలాయించవద్దని... ఉద్యోగభద్రత కల్పించాలని ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండేటి ప్రసాద్‌నాయుడు డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం టీం లీడర్‌ హరినాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగభద్రత కల్పించాలి 

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ 


కడప(ఎర్రముక్కపల్లి),ఆగస్టు 11: ఆరోగ్య మిత్రలను నెట్‌వర్క్‌కు బదలాయించవద్దని...  ఉద్యోగభద్రత కల్పించాలని ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండేటి ప్రసాద్‌నాయుడు డిమాండ్‌ చేశారు. కడప నగరం వైఎ్‌సఆర్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కార్యాలయంలో ఎదుట గురువారం నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, వేతనాల పెంపు చేపట్టాలని కోరారు. హైకోర్టులో ఉన్న వ్యాజ్యంపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ట్రావెలింగ్‌ అలవెన్సులను కల్పించాలని విన్నవించారు.  కొవిడ్‌తో మృతిచెందిన ఆరోగ్యశ్రీ ఉద్యోగుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. అనంతరం డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ బాలాంజనేయులుకు వినతిపత్రం సమర్పించా రు. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం నాయకులు హరినాథ, రామారావు, సమీర్‌, విజయ్‌, చెన్నారెడ్డి, వేణు, వెంకట్‌రెడ్డి, జనార్థన్‌రెడ్డి, టేకూరిపేట శ్రీని వాసులు, నాగలక్ష్మిదే వి, సుబ్బరాజు, సుధాకర్‌రెడ్డి, రవి, బాలయ్య, రమాదేవి, శ్రీలక్ష్మి, గిరిజ, గీతావాని, వణశ్రీ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising