ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దారి సమస్యను పరిష్కరించరా..!

ABN, First Publish Date - 2022-09-27T05:03:17+05:30

దారి సమస్య పరిష్కారించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గ్రామస్థులు చేపట్టిన ఆం దోళన ఉద్రిక్తతకు దారి తీసిన సంఘటన సోమవారం పీలేరు తహ సీల్దారు కార్యాలయంలో జరిగింది.

రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థుల మధ్య వాగ్వాదం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రెవెన్యూ సిబ్బందితో గ్రామస్థుల వాగ్వాదం

 తహసీల్దార్‌ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు 

పీలేరు, సెప్టెంబరు 26: దారి సమస్య పరిష్కారించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గ్రామస్థులు చేపట్టిన ఆం దోళన ఉద్రిక్తతకు దారి తీసిన సంఘటన సోమవారం పీలేరు తహ సీల్దారు కార్యాలయంలో జరిగింది. పీలేరు మండలం మేళ్లచెరువు పంచాయతీ ఎగువ కొత్తపల్లెలో గత కొంత కాలంగా దారి సమస్య ఉంది. తమ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ బోరును, తమ వ్యవసాయ పొలాలకు వెళ్లే దారిని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మిస్తున్నాడని, వాటి వల్ల తాము తమ పొలాలకు వెళ్లలేమని తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది రెవెన్యూ అధికారులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో  పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విష యం తెలుసుకున్న ఎస్‌ఐ నరసింహుడు తన సిబ్బందితో తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడి శాంతింపజేశారు.  అదే సమయంలో పీలేరు ఇందిరానగర్‌కు చెందిన  వాసుదేవరెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయడం లేదని, తన భూమికి సంబంధించిన పూర్తి రికార్డులు తన వద్ద ఉన్నా పట్టించుకోకుండా ఇతరులకు సాయపడుతున్నారని ఆరోపిస్తూ తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. 

Updated Date - 2022-09-27T05:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising