ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులం పేరుతో దూషించినా పట్టించుకోరా!

ABN, First Publish Date - 2022-07-01T05:42:37+05:30

కులం పేరుతో దూషించి నలుగురిలో అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టిం చుకుని న్యాయం చేయలేదని బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)నేత కంగేరి నంద మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె క్రైం, జూన్‌ 30: కులం పేరుతో దూషించి నలుగురిలో అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టిం చుకుని న్యాయం చేయలేదని బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)నేత కంగేరి నంద మండిపడ్డారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రా ష్ట్రం నల్గొండ జిల్లా చింతపల్లె మండలం కూరి వేడుకు చెందిన మహ్మద్‌సనా, మదనపల్లె మం డలం పోతబోలు పంచాయతీ దిగువ గాండ్లపల్లెకు చెందిన రమేష్‌కుమార్‌లు మూడే ళ్లుగా ప్రేమించుకుని ఈ ఏడాది జనవరిలో మతాంతర వివాహం చేసుకున్నారన్నారు. అయితే సనాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టి రమేష్‌కు మరో వివాహం చేయాలనే ఉద్దేశ్యం తో అత్తింటివారు నానాచిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. ఈ విషయంలో తాలూకా పోలీసులు పట్టించుకుని న్యాయం చేయకపోవడంతో బాధితురాలు స్టేషన్‌ వద్ద ధర్నా చేసి అత్తింటివారిపై కేసునమోదు చేయించిందన్నారు.  ఆ విషయం పక్కనబెడితే తనను కులం పేరుతో దూషించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటని మండిప డ్డారు. సనా అత్తింటివారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేసి తనకు న్యాయం చేయకుంటే స్టేషన్‌ వద్ద ఆమరణ దీక్ష చేస్తానంటూ నంద హెచ్చరించారు. కార్యక్ర మంలో బాధితురాలు మహ్మద్‌సనా, బీఎస్పీ కార్యకర్తలు వేణుగోపాల్‌, శ్రీనివాసులు, నర్సింహులునాయక్‌, రెడ్డెమ్మ, గంగాదేవి, రామకృష్ణ,  పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T05:42:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising