ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొంత చెల్లెలికి న్యాయం చేయండి

ABN, First Publish Date - 2022-06-26T04:41:34+05:30

ప్రజలకు న్యాయం చేసే ముందు మీ సోదరి అయిన సునీతకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్‌ రవి) సీఎం జగన్‌కు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి, రామగోపాల్‌రెడ్డి

పులివెందుల టౌన్‌, జూన్‌ 25: ప్రజలకు న్యాయం చేసే ముందు మీ సోదరి అయిన సునీతకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్‌ రవి) సీఎం జగన్‌కు సూచించారు. శనివారం మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లెలో టీడీపీ నేత రామగోపాల్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రోజుల కింద ట పులివెందులలో వైసీపీ ప్లీనరీలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ప్రజలను మఽభ్యపెట్టేలా మాట్లాడారని తెలిపారు. నియోజకవర్గంలోని కత్తులూరు, కామసముద్రం, లోమడ, తాళ్లపల్లె పంచాయతీల్లో పది శాతం మందికే ఈ-క్రాప్‌ జరిగిందని ఈ విషయాన్ని అవినాశ్‌రెడ్డి చెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు చేసిన తప్పిదాలపై ఏ విధం గా చర్యలు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. డ్రిప్‌ పరికరాల విషయంపై టీడీ పీ హయాంలో రూ.1000 కోట్లు అప్పు చేశామని చెబుతున్నారని అందుకు సంబంధించి రైతులందరికీ చంద్రబాబునాయుడు పరికరాలు అందించారన్నారు.

ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలు చేసిన అప్పు కట్టడం సర్వసాధారణమైన విషయమని, ప్రస్తు తం వైసీపీ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్లు అప్పు చేసిందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో రైతులకు రైతు రథం ద్వారా పరికరాలు కూడా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రైతులపై ప్రేమ ఉందని చెబుతున్న మీరు ఇంత వరకు రైతులకు డ్రిప్‌ ఇవ్వకుం డా ఎందుకు అన్యాయం చేశారని ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్ల వుతున్నా మెడికల్‌ కళాశాలలో ఎంతవరకు పనులు జరుగుతున్నాయో ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నపుడు ఆయన నుఈ ప్రాంతీయులు ఎప్పుడైనా కలిసే వారని ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌ను కల వాలంటే ఎన్నాళ్లు పడుతుందో అందరికీ తెలుసన్నారు.

అందరికీ పంటల బీమా వస్తుందని వైసీపీ నేతలు మాయమాటలు చెబుతున్నారని, నేను ఈరోజు జేడీతో కూడా మాట్లాడానని ఈ-క్రాప్‌, వేలిముద్ర వేసి ఉండి బీమా రాకుండా ఉన్న వారికి మాత్రమే వస్తుందని చెప్పారన్నారు. జూలైలో ముఖ్యమంత్రి వస్తున్నారని రైతులతో కలిసి సీఎంనే అడుగుతామని తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం పనిచేస్తుందా లేదా అని అర్థం కావడం లేదన్నారు. కొన్ని ఆస్పత్రులకు వెళితే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌ పడతాయని చెబుతున్నట్లు మా దృష్టికి వచ్చిందన్నారు. అందువల్ల రోగాల బారిన పడి న వారు చికిత్సకు వెళ్లేవారు సొంత డబ్బుతోనే చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పాదయాత్రలో దుల్హన్‌ పథకాన్ని రూ.50 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచుతానని ప్రకటించారని, ఇపుడు ఆ పథకం సంగతేమిటని ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరిగితే ఎంతవరకైనా పోరాడతామని తెలిపారు. సమావేశంలో టీడీపీ నేతలు తూగుట్ల మధుసూదన్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, సిద్దారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, మహబూబ్‌బాష, నల్లగారి భాస్కర్‌రెడ్డి, ఉన్నతి కృష్ణారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T04:41:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising