ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కల సంరక్షణ మరిచారా..!

ABN, First Publish Date - 2022-08-12T05:14:46+05:30

పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి.. పచ్చదనాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబు తుంటాయి. కానీ అందుకు తగ్గ చర్యలు తీసు కోవ డంలో అధికారులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఇందుకు ఉదాహరణగా మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లెలోని వనమిత్ర కేంద్రాన్ని చెప్పవచ్చు. ఇక్కడ 30 ఏళ్ల క్రితం ఐదెకరాల్లో ప్రభుత్వం ద్వారా నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచేవారు.

కంపచెట్లతో నిండి ఉన్న వనమిత్ర నర్సరీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిరుపయోగంగా వనమిత్ర కేంద్రం

పట్టించుకోని అధికారులు

లక్కిరెడ్డిపల్లె, ఆగస్టు 11: పచ్చని చెట్లు.. ప్రగతికి మెట్లు, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి.. పచ్చదనాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబు తుంటాయి. కానీ అందుకు తగ్గ చర్యలు తీసు కోవ డంలో అధికారులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఇందుకు ఉదాహరణగా మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లెలోని వనమిత్ర కేంద్రాన్ని చెప్పవచ్చు. ఇక్కడ 30 ఏళ్ల క్రితం ఐదెకరాల్లో ప్రభుత్వం ద్వారా నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచేవారు. తద్వారా రోడ్డుకిరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను నాటి పచ్చదనానికి కృషి చేయాలనేది ఉద్దేశ్యం. కానీ నేడు ఆ నర్సరీని పట్టించుకునేవారు లేక అధ్వా నంగా తయారైంది. 

మండల కేంద్రంలోని వనమిత్ర కేంద్రం ద్వారా మొక్కలను పెంచి రామాపురం, చక్రాయపేట, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె మండలాల్లో అటవీశాఖ అధికారుల ద్వారా మొక్కలు నాటేవారు. ఒకప్పుడు ఈ నర్సరీ లక్షల మొక్కలతో ఎప్పుడూ కళకళలాడేది. జామాయిల్‌ చెట్లు, చింత, వేప, ఇతర మొక్కలను పెంచి మండలాలకు ఉచితంగా అందించేవారు. కానీ పర్యవేక్షణ లోపంతో నేడు వెలవెల బోతోంది. ఐదేళ్లుగా ఒక్క మొక్కను కూడా పెంచక పోవడం, ఉన్న వాటిని సంరక్షించకపోవడం వల్ల నిరుపయోగంగా తయారైంది. పైగా ఇక్కడ పదివేల లీటర్ల డ్రమ్ములు, తదితర వస్తువులు తుప్పు పట్టిపోతున్నాయి. దీనికి తోడు ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద చెట్లను స్థానికులు కొట్టుకుని తీసుకెళ్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. 


ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తాం 

లక్కిరెడ్డిపల్లె వనమిత్ర కేంద్రంలో ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేస్తాం. మొక్కలు విరివిగా పెంచి యథావిధిగా మండలాలకు ఉచితంగా పంపిణీ చేస్తాం. పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయనున్నాం. 

- నాగరాజు, డీఎ్‌ఫవో 

Updated Date - 2022-08-12T05:14:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising