ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయాలి

ABN, First Publish Date - 2022-11-30T23:48:07+05:30

గ్రామ పంచాయతీ ప్రణాళికలను రెండు రోజుల్లో పూర్తిచేసి తరువాత గ్రామసభల్లో ప్రజామోదం పొంది డిసెంబర్‌ 15లోగా సమాచారం అప్‌లోడ్‌ చేయాలని పంచాయతీరాజ్‌ జిల్లా అధికారి(డీపీవో) ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు.

మాట్లాడుతున్న డీపీవో ప్రభాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(రూరల్‌) నవంబర్‌ 30: గ్రామ పంచాయతీ ప్రణాళికలను రెండు రోజుల్లో పూర్తిచేసి తరువాత గ్రామసభల్లో ప్రజామోదం పొంది డిసెంబర్‌ 15లోగా సమాచారం అప్‌లోడ్‌ చేయాలని పంచాయతీరాజ్‌ జిల్లా అధికారి(డీపీవో) ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం డీపీఆర్‌సీ భవనంలో ఎంపీడీవోలు, ఈవోపీఆర్‌డీలు, పం చాయతీ సెక్రటరీలు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు గ్రామ పంచాయతీ ప్రణాళికలపై రెండు రోజుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం క్రింద గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలన్నారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షణ పథకంలో భాగంగా స్వమిత్ర సర్వేను సకాలంలో పూర్తి చేయడంపై ఈవోపీఆర్‌డీలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సర్వే సమయంలో స్ధానికంగా అందుబాటులో ఉండాలన్నారు. అన్ని మండలాల్లో ప్రాపర్టీ అసెస్‌మెంట్‌ రికార్డ్సును సిద్దంగా ఉంచుకోవాలన్నారు. గ్రామ పంచాయతీలోని ఆస్తులను, భూములను ఐడెంటిపై చేయాలన్నారు. పబ్లిసిటీ తరువాత గ్రామ సభలు నిర్వహిస్తే సర్వేలో సమస్యలు ఎదురుకావన్నారు. పంచాయతీలలో అన్ని రకాల ఆస్తులను గుర్తించాలన్నారు. రివిజన్‌ రిజిస్టర్‌ను మెయింటెనెన్స్‌ చేయాలన్నారు. ఈ విధానం సౌమిత్ర సర్వేకు చాలా ఉపయోగపడుతుందన్నారు. అన్ని మండలాల్లో ప్రాపర్టీ అసెస్‌మెంట్‌ రికార్డులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ప్రాపర్టీ్‌సకి ఒక అసె్‌సమెంట్‌ నంబర్‌ ఉండాలన్నారు. అసె్‌సమెంట్‌ రిజిస్టర్‌ను తప్పకుండా తయారుచేసుకోవాలన్నారు. ప్రైవేట్‌ ప్రాపర్టీస్‌ ఎంత.. ప్రభుత్వ ప్రాపర్టీస్‌ ఎంత.. గ్రామ కంఠంలో ఎంత భూమి ఉందన్న వివరాలను రికార్డుల్లో పొందుపరచాలన్నారు. శాశ్వత భూహక్కుతో ప్రజల ఆస్తులకు విలువ వస్తుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పన్ను వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఖాదర్‌బాషా, కడప, బద్వేల్‌ డీఎల్‌పీవోలు ఖాదర్‌బాషా, రమణారెడ్డి, ఈవోపీఆర్‌డీలు, పంచాయతీ సెక్రటరీలు, కంప్యూటర్‌ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising