ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల ఇళ్లను కూల్చడం దారుణం

ABN, First Publish Date - 2022-11-25T23:33:49+05:30

నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చడం దారుణమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీని వాసరెడ్డి పేర్కొన్నారు.

ఇళ్లు కోల్పోయిన బాధితులను పరామర్శిస్తున్న శ్రీనివాసరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి

కడప (ఎర్రముక్కపల్లె), నవంబరు 25: నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లను కూల్చడం దారుణమని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీని వాసరెడ్డి పేర్కొన్నారు. కడప నగరం మాసాపేటలో శుక్రవారం కూల్చిన ఇళ్ల బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ కూలి నాలీ చేసుకుని కష్టపడి పనిచేసి నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం అన్యాయమన్నారు. ఈ రోడ్డుపై ట్రాఫిక్‌ సమస్య లేదని, ఎటువంటి ఆఫీసులు కానీ, ఫ్యాక్టరీలు కానీ, హాస్పిటల్స్‌ కానీ రద్దీతో కూడుకున్నవి కావని అన్నారు. జీరో యాక్సిడెంట్‌ కింద రోడ్డు ఉన్నట్లు తెలిపారు. పేదల ఇళ్లు కాబట్టి నిర్లక్ష్యంగా కూల్చివేస్తున్నారని ఆరోపించా రు. వీరికి చుట్టుపక్కల ఎక్కడా కనీసం బాడుగలకు కూడా ఇళ్లు ఇవ్వ డం లేదని చెప్పారు. పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారు ఎక్కడ ఉండా లని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T23:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising