ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్లు నరకడం దుర్మార్గం

ABN, First Publish Date - 2022-12-06T23:15:37+05:30

నిరుపేద దళిత మహిళ భూమిలో మామిడి చెట్లు నరకడం ఫెన్షిం గ్‌ ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్య అని పౌర హక్కుల సం ఘం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.

మామిడి చెట్లను పరిశీలిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, డిసెంబరు 6: నిరుపేద దళిత మహిళ భూమిలో మామిడి చెట్లు నరకడం ఫెన్షిం గ్‌ ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్య అని పౌర హక్కుల సం ఘం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. పౌరహక్కు ల సంఘం నేతలు బాధిత మ హిళ, పోలీసులను కలిసి వివరాలు సేకరించినట్లు తెలిపారు. బుర్రలదిన్నెపల్లె హరిజనవాడ వాసి గంగారపు లక్ష్మిదేవి సానిపాయి రోడ్డులో కస్తూర్భా పాఠశాల సమీపంలో సర్వే నెంబరు 425-ఏలో 1.45 వ్యవసాయ భూమి ఉంది. అందులో మామిడి చెట్లు పెంచుకుంటుండగా ఆ భూమిని రియల్‌ ఎస్టేట్‌ కోసం 20 రోజుల కిందట మేడా విజయశేఖర్‌రెడ్డి తన అనుచరులైన రఫీక్‌, సాంబ, బలరాంను పంపి ఆ భూమిని అమ్మాలని సంప్రదించా రు.

దీంతో మహిళ ఆ భూమి తమకు జీవనాధారమని, నేను ఎవరికీ అమ్మ ను అని చెప్పడంతో ఆమెను బెదిరించారని, ఎలాగైనా భూమిని కబ్జా చేయాలని నయానో భయానో కబ్జా చేసేందుకు 100 మామిడి చెట్లను నరికి వేయ డం ప్రజలకు, పోలీసులకు అందరికీ తెలుసన్నారు. దీనిని పౌరహక్కుల సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చిక వాగులు, వంకలు, గుట్ట లు కబ్జా చేయడం పరిపాటైందన్నారు. ఈ సంఘటనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి రవిశంకర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డెయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీపీయం కార్యవర్గ సభ్యులు విశ్వనాధనాయక్‌, పలువురు దళిత సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:15:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising