‘ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం’లో సహకరించాలి
ABN, First Publish Date - 2022-10-08T04:25:33+05:30
ఓటరు కార్డుకు ఆధార్ అను సంధానం చేయడంలో అ న్ని రాజకీయ పార్టీలు సహక రించాలని ఆర్డీవో ఎంఎస్ ము రళి పేర్కొన్నారు.
మదనపల్లె టౌన్, అక్టోబరు 7: ఓటరు కార్డుకు ఆధార్ అను సంధానం చేయడంలో అ న్ని రాజకీయ పార్టీలు సహక రించాలని ఆర్డీవో ఎంఎస్ ము రళి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలో కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల మార్పుల ఆవశ్యకతపై రాజకీయ నాయ కులతో చర్చించారు. ఓటర్లకు సౌకర్యంగా ఉండేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఓటర్లకు ఆధార్‌తో పాటు ఏదేని గుర్తింపు కార్డు అందించే విషయంలో బీఎల్‌వోలకు సహకరించాలన్నారు. కాగా పట్టభద్రుల ఓటర్ల నమోదు విషయమై పలు అంశాలను రాజకీయ పార్టీల నాయకులు ఆర్డీవోను అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
Updated Date - 2022-10-08T04:25:33+05:30 IST