ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-12-16T23:50:27+05:30

జగనన్న హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీ షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరే ట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జనన్న హౌ సింగ్‌ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్‌ ఏఈలు, డీఈ లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీఎంఏవై గ్రామీణ్‌ ఇళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి(కలెక్టరేట్‌), డిసెంబరు 16: జగనన్న హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీ షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరే ట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జనన్న హౌ సింగ్‌ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్‌ ఏఈలు, డీఈ లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి రోజు రోజుకు పురోగతి కనిపించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా లో మంజూరైన ఇళ్లన్నీ వందశాతం పూర్తి చేయించాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇళ్ల నిర్మా ణాలకు సంబంధించి ఒక్కో లబ్దిదారునికి రూ.35 వేలు రుణం ఇప్పించాలన్నారు. హౌసింగ్‌ లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయించడంలో డీఆర్‌డీఏ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీడీవోలు సచివాలయం వారీగా ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో సమీక్షలు నిర్వహించి ఇచ్చిన లక్ష్యాన్ని సాధించాలన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన పథకం కిం ద జిల్లాలో మంజూరైన ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేం దుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పీయం ఏవై గ్రామీణ్‌ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇంకా ప్రా రంభం కాని ఇంటి నిర్మాణాలు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భం గా మండలాల వారీగా ఇళ్ల నిర్మా ణాల పురోగతిపై సుధీర్ఘంగా చ ర్చించారు. కార్యక్రమంలో హౌసిం గ్‌ పీడీ శివయ్య, ఆర్‌డబ్ల్యుఎస్‌ఈ ప్రసన్నకుమార్‌, డీఈ శ్రీనివాస్‌రెడ్డి, సీపీవో కృష్ణానాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు పాల్గొన్నారు.

టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలి

టిడ్కోలో మౌలిక వసతులు యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని అధికారులను, కాంట్రాక్టర్లను కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ వీసీ హాల్‌లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పురోగతి, వసతుల కల్పన అభివృద్ధి పనులపై మున్సిపల్‌ కమిషనర్లతో పాటు కాంట్రాక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ వేగవంతం చేసేందుకు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను, కాట్రాక్టర్లను కలెక్టర్‌ ఆదేశించారు. మదనపల్లె టిడ్కో గృహాల్లో మౌలిక వసతులన్నీ త్వరగా పూర్తి చేయాలన్నారు. సీసీ రోడ్డు, ఇంటింటికి నీటి కనెక్షన్‌, అండర్‌ డ్రైనేజ్‌ తదితర పనులన్నీ జనవరి చివరిలోగా పూర్తి చే యాలన్నారు. ఈ సమీక్షలో రాయచోటి మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబు, టిడ్కో డీఈలు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.జగనన్న హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ పీఎస్‌ గిరీ షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరే ట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జనన్న హౌ సింగ్‌ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై హౌసింగ్‌ ఏఈలు, డీఈ లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Updated Date - 2022-12-16T23:52:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising