ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గందరగోళంగా బడ్జెట్‌ సమావేశం

ABN, First Publish Date - 2022-03-06T05:02:15+05:30

కడప కార్పొరేషన్లో శనివారం జరిగిన బడ్జెట్‌ సమావేశం గందరగోళంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్రమ లేఔట్లపై గరంగరం - చర్చల మధ్యలోనే రూ.597.23 కోట్లతో బడ్జెట్‌కు ఆమోదం

కడప(ఎడ్యుకేషన్‌), మార్చి 5 : కడప కార్పొరేషన్లో శనివారం జరిగిన బడ్జెట్‌ సమావేశం గందరగోళంగా మారింది. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి నిధుల వినియోగంపై బడ్జెట్‌ ప్రతులను చదువుతుండగా ఓ కార్పొరేటర్‌ గత బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు ఎంత నిధులు కేటాయించారు ఎక్కడ ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కడప కార్పొరేషన్లో మేయర్‌ సురేశ్‌బాబు అధ్యక్షతన శనివారం కార్పొరేషన్‌ బడ్జెట్‌ సమావేశం జరిగింది. ముందుగా ఇటీవల మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి సభ సంతాపం ప్రకటించారు. అనంతరం బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. 47వ డివిజన్‌ కార్పొరేటర్‌ పాకా సురేశ్‌ మాట్లాడుతూ గత బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ నిధులు ఎంత కేటాయించారు, ఎక్కడ ఖర్చు చేశారని ప్రశ్నించారు. నిత్యానందరెడ్డి మాట్లాడుతూ కార్పొరేషన్‌కు సంబంధించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు గడువు పూర్తయిందన్నారు. రోడ్ల పక్కన వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు కూడా ఒక నిర్ధిష్టమైన ట్యాక్స్‌ నిర్ణయిస్తే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన క్లబ్‌ కార్యక్రమం పై కార్పొరేటర్‌ బాషా మాట్లాడుతూ క్లబ్‌ కార్యక్రమం ద్వారా కార్పొరేషన్‌కి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరికి లాభమని ప్రశ్నించారు. సురేశ్‌ మాట్లాడుతూ కార్పొరేషన్‌ పరిధిలో ఎన్ని అక్రమ లేఔట్లు ఉన్నాయి, వాటి పై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దీనిపై వాడి వేడిగా చర్చ జరుగుతుండగా సమయం అధికమైందంటూ మేయర్‌ సురేశ్‌బాబు రూ.597.23 కోట్లతో బడ్జెట్‌ ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఖర్చు రూ.570.12 కోట్లుగాను మిగులు నిల్వ రూ.27.11 కోట్లు ఉన్నట్లు చెప్పారు. నిధుల్లో 40 శాతం నిధులు మురికివాడల్లో అభివృద్ధి పనులకు చాలని నిర్ణయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ శిశు సంక్షేమ వికలాంగులకు కేటాయించిన నిధులు ఖర్చు చేయాలని బడ్జెట్‌లో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎక్స్‌ అఫీషియో సభ్యులు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T05:02:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising