ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ జిమ్మిక్కులను ఎదుర్కొనేందుకే కమిటీలు

ABN, First Publish Date - 2022-06-13T05:27:15+05:30

ఎన్నికల్లో వైసీపీ జిమ్మిక్కులు చేస్తుందని, ఇప్పటి నుంచే వాటిని ఎదుర్కొనేందుకు క్లస్టర్‌కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న పుట్టా సుధాకర్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌

మైదుకూరు, జూన్‌ 12 : ఎన్నికల్లో వైసీపీ జిమ్మిక్కులు చేస్తుందని, ఇప్పటి నుంచే వాటిని ఎదుర్కొనేందుకు క్లస్టర్‌కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ మాజీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి క్లస్టర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి కోసం కాకుండా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడాలని, 2023లో ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. ఇప్పటి నుంచే కష్టపడాలని, అధికార పార్టీ దొంగ ఓటర్లను సృష్టించుకోవడం, టీడీపీ మద్దతుదారులఓట్లను  తొలగించడం, దౌర్జన్యాలకు పాల్పడటం చేస్తుందన్నారు.  నియోజకవర్గంలో 20 వేల ఓటర్లను ఒక క్లస్టర్‌గా విభజించి ఇన్‌చార్జీలను నియమించడం జరుగుతుందన్నారు. అలాగే బూత్‌ లెవల్‌ ఇన్‌చార్జీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు దువ్వూరు మండలానికి కారపురెడ్డి సంజీవరెడ్డి, పాతకుంట మోహన్‌రెడ్డి, మైదుకూరు రూరల్‌కు మాచుపల్లి రామచంద్రనాయుడు, మైదుకూరు టౌన్‌కు ఆకుల క్రిష్ణయ్య,పాశం మారుతీ, చాపాడుమండలానికి సానా ప్రతా్‌పరెడ్డి, వీరశేఖర్‌రెడ్డి, ఖాజీపేటకు నంద్యాల సుబ్బయ్య, తిప్పిరెడ్డి బ్రహ్మరెడ్డి,  బి మఠానికి ముడమాల పోలిరెడ్డిలను నియమించినట్లు ప్రకటించారు.  పార్టీ గెలుపు కోసం అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి బాబు, ధనపాల జగన్‌, ఆకుల క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-13T05:27:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising