ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైలు కింద పడి కమిషనర్‌ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-06-26T05:47:20+05:30

ఆయన పుట్టపర్తి జిల్లా మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆయన ఏమి జరిగిందో తెలియదు కానీ కడప-రాయచోటి రోడ్డులోని రైల్వే గేటు సమీపంలో శనివారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఒత్తిళ్లా లేక ఇతర కారణాలతో తనువు చాలించాడా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ముని

మృతదేహాన్ని పరిశీలిస్తున్న కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పని ఒత్తిడా....ఇతర కారణాలా?

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు 

కడప(క్రైం), జూన్‌ 25 : ఆయన పుట్టపర్తి జిల్లా మున్సిపల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవనం సాగిస్తున్న ఆయన ఏమి జరిగిందో తెలియదు కానీ కడప-రాయచోటి రోడ్డులోని రైల్వే గేటు సమీపంలో శనివారం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విధి నిర్వహణలో ఒత్తిళ్లా లేక ఇతర కారణాలతో తనువు చాలించాడా అనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మునికుమార్‌ ఆత్మహత్య విషయం తెలుసుకున్న కడప రైల్వే సీఐ మహమ్మద్‌బాబా, ఎస్‌ఐ రారాజు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ వివరాల మేరకు... కడపకు చెందిన మునికుమార్‌ 2006లో కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. ఇక్కడే పనిచేస్తూ సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌గా పదోన్నతులు పొందారు. ఈయనకు భార్య శైలజతో,  పదో తరగతి చదువుతున్న కుమార్తె, కుమారుడు ఉన్నారు. కమలాపురంలో కూడా కమిషనర్‌గా విధులు నిర్వహించిన ఈయన రెండు నెలల క్రితం పుట్టపర్తి నగర పంచాయతీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఫ్యామిలీ కడపలోనే ఉంటుండడంతో ఈయన పుట్టపర్తికి వెళ్లి శని, ఆదివారాలలో ఇంటికి వచ్చి ఫ్యామిలీతో గడుపుతుండేవారు. పని ఒత్తిడా లేక ఇతర కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డారా అని తేలాల్సి ఉందని సీఐ పేర్కొన్నారు. ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి రిమ్స్‌కు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈయన మృతిపై పలువురు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు తమ సంతాపం తెలిపారు.


శోకసంద్రంలో కుటుంబ సభ్యులు 

పుట్టపర్తి కమిషనర్‌ మునికుమార్‌ ఆత్మహత్య సమాచారం అందుకున్న కటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార ్టం కోసం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కార్పొరేషన్‌ సిబ్బంది రిమ్స్‌కు చేరుకున్నారు. కడపలో విధులు నిర్వహించిన మునికుమార్‌ సౌమ్యుడని అందరితో మంచిగా ఉంటూ సేవలు అందించారని కొనియాడారు. మునికుమార్‌ ఆత్మహత్యతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. 

Updated Date - 2022-06-26T05:47:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising