ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామీల అమలులో సీఎం విఫలం

ABN, First Publish Date - 2022-07-08T05:24:40+05:30

ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి హామీల అమలులో విఫలమయ్యారని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ధ్వజమెత్తారు.

విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(సెవెనరోడ్స్‌), జూలై 7 : ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి  హామీల అమలులో విఫలమయ్యారని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి సొంత జిల్లాలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పనులను పూర్తి చేస్తారని, ఆయన ఆశయాలను నెరవేరుస్తాడని గెలిపిస్తే నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తరలించేందుకు అనుగుణంగా గాలేరు-నగరి, తెలుగు గంగ వెడల్పు చేపట్టామని చెబుతున్నప్పటికీ నిధులు లేమితనంతో పనులు పూర్తికాలేదన్నారు. దీంతో పంట కాలువల నిర్మాణం జరగక అదనంగా ఒక ఎకరా ఆయకట్టును కూడా అభివృద్ధి చేయలేకపోయారన్నారు. ఉద్యాన పంటలకు ప్రసిద్ధిగాంచిన కడప జిల్లాలో పంట సాగుకు అవసరమైన సూక్ష్మ నీటి సేద్య పరికరాలపై గత మూడు సంవత్సరాలుగా రాయితీని పూర్తిగా నిలిపివేయడం బాధాకరమన్నారు. పులివెందుల కేంద్రంగా సూట్‌(తరుగు) పేరుతో 25 శాతం పంటను స్థానిక అధికార పార్టీ దళారులు చీనీ రైతులను దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నప్పటికీ కడప రిమ్స్‌లో కొన్ని మాసాలుగా ఎమ్మార్‌ఐ స్కానింగ్‌ యంత్రం మూలనపడి రోగులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే వారు లేరన్నారు. రిమ్స్‌ స్థాపించి దశాబ్దాలు అవుతున్నా గుండె, కిడ్నీ గ్యాస్ర్టో సంబంధిత విభాగాలు వైద్యుల నియామకం జరగకపోవడం విచారకరమన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన బుగ్గవంక బ్యూటీఫికేషన, నగర సుందరీకరణ, రోడ్ల వెడల్పు, ఆక్రమణల తొలగింపు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, అర్హులైన పేదలకు ఇళ్లు ఇంటి స్థలం,  భూమి పంపిణీ మహిళా డైరీ,  ఐటీ పార్కుల ఏర్పాటు వంటి  నిర్మాణాలు పూర్తిగా అటకెక్కించారన్నారు. రెండు తరాలుగా ఓట్లేసి గెలిపించి అధికారాన్ని కట్టబెడుతున్న కడప జిల్లా ప్రజానీకానికి వైఎ్‌స.జగనమోహనరెడ్డి ఎంత చేసినా తక్కువేనన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన వాగ్దానాలు తక్షణం అమలు చేయకపోతే గెలిపించిన ప్రజలే ఓడి స్తారని వారు హెచ్చరించారు. 


Updated Date - 2022-07-08T05:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising