అనారోగ్యంతో సీఐ రుషికేశవ మృతి
ABN, First Publish Date - 2022-07-10T04:59:26+05:30
నిజాయితీకి మారుపేరుగా నిలిచిన సీఐ రుషికేశవ(47) అనారోగ్యంతో మృతి చెందా రు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శివమణిగా పేరున్న ఈయన ఏడాదిగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఎస్‌ఐ, సీఐగా చిత్తూరు జిల్లాలో పనిచేసి నేరస్థులకు సింహస్వప్నంగా నిలిచారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శివమణిగా గుర్తింపు
నేరస్థులకు ఆయనంటే సింహస్వప్నం
మదనపల్లె క్రైం, జూలై 9: నిజాయితీకి మారుపేరుగా నిలిచిన సీఐ రుషికేశవ(47) అనారోగ్యంతో మృతి చెందా రు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శివమణిగా పేరున్న ఈయన ఏడాదిగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఎస్‌ఐ, సీఐగా చిత్తూరు జిల్లాలో పనిచేసి నేరస్థులకు సింహస్వప్నంగా నిలిచారు. నేరస్థుల గుండెల్లో దడ పు ట్టించి పోలీసుశాఖకు వన్నె తెచ్చారు. వివరాలివీ.. అనం తపురం పట్టణానికి చెందిన సుంకర రుషికేశవ 2002లో పోలీసుశాఖలో ఎస్‌ఐగా చేరి తంబళ్ల పల్లె, పెద్దపంజాణి, పుంగనూరు, గంగవరం, పీటీఎం, తంబళ్లపల్లెలో పనిచేశారు. 2013లో సీఐగా పదోన్నతి పొంది, ఆ తరువాత చిత్తూ రు డీటీసీ, టాస్క్‌ఫోర్స్, ములకలచెరువు సీఐ గా, చిత్తూరు ట్రాఫిక్, స్పెషల్ బ్రాంచ్ సీఐగా పనిచేశారు. అనంతరం ఏడాదిన్నర కిందట కర్నూల్ సీబీసీఐడీకి బదిలీపై వెళ్లి ఏడాది కిం దట అనారోగ్యంపాలై మెడికల్ లీవ్‌లో ఉన్నారు. హైదరా బాద్, బెంగళూరు, వేలూరు సీఎంసీ, తిరుపతి, మదనప ల్లె ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. కొద్దిరోజులుగా మదనపల్లెలోని రోజా ప్లాట్స్‌లో నివాస ముంటూ చికిత్స తీసుకుంటున్నారు. కాగా రెండురోజుల కిందట పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఈయనకు భార్య సుశీల, కుమారు డు రాజసింహా, కుమార్తెలు పల్లవి, రోహిత ఉన్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో విషాదం అలుముకుంది. శనివారం మృతదేహాన్ని మదనపల్లెకు తీసుకురావడంతో డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐలు, ఎస్‌ఐలు నివాళుల ర్పించి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం పుం గనూరు మండలం భగత్‌సింగ్‌కాలనీలోని రుషికేశవ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.
శివమణిగా గుర్తింపు..
2004లో పెద్దపంజాణి, పుంగనూరు పోలీస్‌స్టేషన్లలో ఎస్‌ఐగా పనిచేస్తున్న ఈయన నేరస్థుల ఆట కట్టించారు. రాజకీయ నాయకులు, అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా న్యాయానికి పట్టం కట్టారు. అన్యాయం జరిగిందని తెలి స్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించేవారు. అదే విధంగా సివి ల్ దుస్తులు, మారువేషాల్లో గ్రామాల్లో తిరుగుతూ నాటు సారా తయారీ, పేకాట, కోడిపందెం స్థావరాలపై దాడు లు నిర్వహించి నిందితులను అరెస్టు చేసేవారు. ముఖ్యం గా మహిళా కేసుల విషయంలో సీరియస్‌గా ఉండేవారు. ఆ సమయంలో సినీనటుడు అక్కినేని నాగార్జున నటిం చిన శివమణి సినిమా విడుదలైంది. నీతినిజాయితీగా పనిచేస్తూ.. ప్రజల మన్ననలు పొందుతున్న రుషికేశవకు ప్రజలే శివమణిగా నామకరణం చేశారు. ఉన్నతాధికారు లు కూడా అలాగే పిలిచేవారు. ములకలచెరువు సీఐగా పనిచేస్తున్న సమయంలో వ్యవసాయ పొలాల్లో భారీగా బోరుమోటార్లు, స్టార్టర్ పెట్టెలు చోరీకి గురయ్యాయి. దీం తో పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందిపడతారనే ఉద్దే శంతో సొంతనిధులతో తంబళ్లపల్లె, ములకలచెరువు, పీటీఎం, పెద్దమండ్యం మండలాలకు చెందిన రైతులకు వ్యవసాయ సామగ్రి వితరణ చేశారు. అలాగే ఉన్నత చ దువుల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల ను గుర్తించి వారికి రూ.5-10 వేల వరకు ఉపకార వేత నాలు అందజేశారు. దీంతో పాటు మదనపల్లెలో వ్యభిచా ర గృహాలపై దాడులు నిర్వహించి హైటెక్ వ్యభిచార గు ట్టును రట్టు చేశారు. అలాగే నేరస్థులు మదనపల్లె విడిచి వెళ్లిపోయేలా కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రాత్రిపూట మద్యంషాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, లా డ్జీల్లో దాడులు నిర్వహించేవారు. దీంతో మదనపల్లెలో నూ నిక్కచ్చిగా విధులు నిర్వహించి తనదైన ముద్ర వే సుకున్నారు. ఆయన అనారోగ్యంతో మరణించడం పోలీస్ శాఖకు తీరని లోటని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2022-07-10T04:59:26+05:30 IST