దేశభక్తి, జాతీయ భావం పెంచేలా వేడుకలు
ABN, First Publish Date - 2022-08-05T05:24:08+05:30
ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావం పెంపొందేలా ప్రతిష్టాత్మకంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పీఎస్ గిరీషా అన్నారు.
కలెక్టర్ పీఎస్ గిరీషా
రాయచోటిలో ఉత్సాహంగా సాగిన 5కే రన్
రాయచోటి(కలెక్టరేట్), ఆగస్టు 4: ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావం పెంపొందేలా ప్రతిష్టాత్మకంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పీఎస్ గిరీషా అన్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రాయచోటి రింగు రోడ్డులోని పోలీస్ పెరేడ్ మైదానం వద్ద 5కే రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ గిరీషా, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్పీ హర్షవర ్ధన్‌రాజు, జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి జెండా ఊపి ప్రారం భించారు. అంతకుముందు కలెక్టర్ శాంతికి చిహ్నమైన పాపురాన్ని ఎగురవేశారు. పోలీస్ పెరేడ్ మైదానం నుంచి సాగిన 5కే రన్ వేంపల్లె రోడ్డు కూడలి, మాసాపేట, సాయి ఇంజనీరింగ్ కళాశాలల, కలెక్టరేట్ మీదుగా తిరిగి పోలీస్ పెరేడ్ మైదానం వరకు ఉత్సాహంగా కొనసా గింది. ఈ ర్యాలీలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తి చాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశభక్తితో పాటు స్వాతంత్య్ర పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన దేశం మరింత అభివృద్ధి సాధించడంలో ప్రతి ఒక్కరూ తమవంతు పాత్ర పోషించాల న్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలన్నారు. 5కే రన్‌లో గెలుపొందిన వారికి ఆగస్టు 15న సర్టిఫికెట్‌తో పాటు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొల్పే విధంగా జిల్లా యంత్రాంగం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తుం దన్నారు. ఎస్పీ హర్షవర్థన్‌రాజు మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిల్చిలా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిం చడం సంతోషకరమన్నారు. జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ ప్రతి ఒక్కరం జాతీయ భావంతో పయనిద్దామని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజ్‌కమల్, డీఆర్‌వో సత్యనారాయణ, రాయచోటి ఆర్డీవో రంగ స్వామి, మున్సిపల్ కమిషనర్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్‌బాషా, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T05:24:08+05:30 IST