ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యల్లమ్మ జాతరను ప్రశాంతంగా జరుపుకోండి

ABN, First Publish Date - 2022-05-22T05:21:57+05:30

చెన్నూరులో ఆదివారం జరిగే యల్లమ్మ జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఐ శ్రీనివాసుల రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నూరు, మే21: చెన్నూరులో ఆదివారం జరిగే యల్లమ్మ జాతరను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి కోరారు. శనివారం సాయంత్రం స్థానిక పోలీ్‌సస్టేషన ఆవరణంలో చెన్నూరులోని అన్ని వర్గాల నేతలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా వ్యవహరించాలన్నారు. కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి పర్యవేక్షణలో సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరూ కలసి మెలసి సమన్వయంతో ఉత్సవం జరుపుకోవాలని, ఎలాంటి సమస్యలు తలెత్తినా సహించేది లేదన్నారు. ఆదివారం అంతా 144 సెక్షన అమలులో ఉంటుందని, ఉదయం నుంచే జాతర జరిగే దారిపొడవునా బందోబస్తు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో యల్లమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆకుల ప్రసాద్‌బాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన జీఎన భాస్కర్‌రెడ్డి, ముదిరె డ్డి సుబ్బారెడ్డి, డీటీ రాజేష్‌, మంజీర్‌ అహ్మద్‌, మునీర్‌ అహ్మద్‌, వారిష్‌, అస్రత,  తదితరులు పాల్గొన్నారు. 


వీధివీధినా పోతుల రాజు ఊరేగింపు

జాతర ఉత్సవాల్లో రెండో రోజు చెన్నూరు పురవీఽధుల్లో పోతుల రాజును ఊరేగించారు. గ్రామ ప్రజలు స్వామిని దర్శించుకున్నారు. గ్రామంలో పోతుల రాజు తిరగడం వల్ల శుభం జరుగుతుందని, ఏడాదికి ఒక సారి స్వామిరాక అందరికీ మేలు చేకూరుతుందని ప్రజల నమ్మకం. 

Updated Date - 2022-05-22T05:21:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising