ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి ముఠా గుట్టు రట్టు

ABN, First Publish Date - 2022-05-18T05:30:00+05:30

కడప నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమం గా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ, యు వతకు విక్రయిస్తున్న అంతర్‌ జిల్లా గంజాయి ముఠాను మైదుకూరు డీ ఎస్పీ వంశీధర్‌గౌడ్‌ సూచనపై మైదుకూరు రూరల్‌ సీఐ నరేంద్రరె డ్డి మాటు వేసి గుట్టురట్టు చేశారు.

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అన్బురాజన్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదుగురు స్మగ్లర్లు అరెస్టు 

రూ.4.40 లక్షల విలువైన 5.5 కిలోల గంజాయి స్వాధీనం 

విలేకరులతో ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడి

కడప(క్రైం), మే 18: కడప నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమం గా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ, యు వతకు విక్రయిస్తున్న అంతర్‌ జిల్లా గంజాయి ముఠాను మైదుకూరు డీ ఎస్పీ వంశీధర్‌గౌడ్‌ సూచనపై మైదుకూరు రూరల్‌ సీఐ నరేంద్రరె డ్డి మాటు వేసి గుట్టురట్టు చేశారు. ఎస్పీ అన్బురాజన్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం పాత్రికేయుల సమావేశంలో గంజాయి కేసు వివరాలు వెల్లడించారు. గంజా యి అక్రమ రవాణా కొనుగోలుకు సంబంధిం చి ఐదుగురు గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దువ్వూరు మండ లం కృష్ణంపల్లిలోని జమలయ్యస్వామి దర్గా వద్ద గంజాయి అక్రమ కొనుగోలు అమ్మకం చేస్తున్న ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు లక్ష ల నలభై వేల రూపాయల పైచిలుకు విలువై న 5.5 కిలోల గంజాయి  స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అరెస్టైన వారిలో ప్రధాన నిందితుడు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు వాసి షేక్‌ ఖైరూన్‌బీ, షేక్‌  హుస్సేన్‌ బాష, అబ్దుల్‌ నూ ర్జహాన్‌, నంద్యాల ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు వాసి పగడాల శివుడు, పగడాల మహేష్‌ ఉన్నట్లు తెలిపారు. అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారంలో ప్రధాన నిందితురాలు, కూతురు అ బ్దుల్‌ నూర్జహాన్‌, కొడుకు షేక్‌ హు స్సేన్‌ బాష సహా పగడాల శివుడు, పగడాల మహేష్‌తో వ్యాపారం చే స్తోందని తెలిపారు. గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్ల రూ పంలో నాణ్యతను బట్టి అమ్మేవారని తెలిపారు.  

 గంజాయి అక్రమ రవాణా విక్రయిస్తున్న ముఠాను మైదుకూరు రూరల్‌, ఇన్‌స్పెక్టర్‌ నరేంద్రరెడ్డి, దువ్వూరు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కెసి.రాజు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి గంజాయి వ్యాపారాన్ని గుట్టు రట్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ వారికి రివార్డులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-05-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising