ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభ్యర్థులను అధిష్టానం ప్రకటిస్తుంది

ABN, First Publish Date - 2022-09-18T05:07:02+05:30

రాబోయే ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తుందని, అంతకు ముందే ఏ నియోజకవర్గంలోనైనా ఎవరికి వారు అభ్యర్థిని తానే అంటూ ప్రకటించుకోవడం సరి కాదని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 17 : రాబోయే ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులను పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తుందని, అంతకు ముందే ఏ నియోజకవర్గంలోనైనా ఎవరికి వారు అభ్యర్థిని తానే అంటూ ప్రకటించుకోవడం సరి కాదని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నందున ఆశావహులు ఎవరైనా టికెట్లు ఆశిస్తారని, అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పార్టీ కోసం కష్టకాలంలో ఎవరైతే పనిచేశారో, పార్టీ కోసం ఎవరు శ్రమిస్తున్నారో వారినే అభ్యర్థిగా ప్రకటిస్తారన్నారు. అభ్యర్థుల ఎంపిక జరిగే వరకు ఏ నాయకుడైనా తన పరిధిలో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. అంతేకానీ ఎవరికి వారు తానే అభ్యర్థిని అంటూ ప్రకటించుకోవడం క్రమశిక్షణ ఉల్లంఘన అవుతుందన్నారు. సమావేశంలో టీడీపీ కడప పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి సానా విజయభాస్కర్‌రెడ్డి, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్బరాజు, మాజీ కౌన్సిలర్లు సీతారామిరెడ్డి, ఏసుదాసు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-18T05:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising