ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటెద్దు పోకడలు మానుకోవాలి

ABN, First Publish Date - 2022-07-06T04:33:02+05:30

ఆర్టీసీ అధికారులు ఒంటెద్దు పోకడలను మానుకోవాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ డిపో కార్యదర్శి ఎస్‌వై బాషా పేర్కొన్నారు.

గేటు ధర్నాలో అసోసియేషన్‌ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండోరోజు నిరసనలో అసోసియేషన్‌

రాయచోటిటౌన్‌, జూలై5: ఆర్టీసీ అధికారులు ఒంటెద్దు పోకడలను మానుకోవాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ డిపో కార్యదర్శి ఎస్‌వై బాషా పేర్కొన్నారు. డిపో అధికారుల విధానాలను నిరసిస్తూ మంగళవారం రెండోరోజు ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరిం చి గేటు ధర్నా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఏర్పడిన అనంత రం డిపో అధికారులు ప్రజల అవసరాలకు తగ్గట్టు కొత్త సర్వీసుల ను ప్రారంభించకపోగా ఉన్న సర్వీసులను రద్దు చేసి అటు ప్రజల ను, ఇటు ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా పరిధి డిపోల్లో కొత్త సర్వీసులను ప్రా రంభిస్తుంటే రాయచోటి డిపోలో మాత్రం ఉన్న సర్వీసులను సైతం ఏకపక్షంగా రద్దు చేయడం దారుణమన్నారు.

సీనియర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ డిపోకు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో అసలు ఆయన ఉన్నారో లేదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని వాపోయారు. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రాకపోతే జరగబో యే ఉద్యమాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీసీఎస్‌ డెలిగేట్‌ ఎస్‌పీ బాబు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వీటినాధ్‌, కార్మిక నాయకులు రామాంజులు, పీహెచ్‌ఎన్‌ రెడ్డి, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T04:33:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising