ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెలవులకు బై.బై...

ABN, First Publish Date - 2022-01-17T05:30:00+05:30

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వచ్చిన వారు సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. పండుగ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 8వ నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

కడప ఆర్టీసీ బస్టాండులో బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణీకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుగు ప్రయాణమైన ప్రజలు, విద్యార్థులు

కడప(మారుతీనగర్‌), జనవరి 17: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వచ్చిన వారు సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. పండుగ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 8వ నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాలలో విద్యనభ్యసించే విద్యార్థులు, వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే ప్రజలు సంక్రాంతికి వారి వారి సొంత ఇళ్ళకు చేరి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపారు. సెలవులు ముగియడంతో తిరిగి వారు చదువుతున్న పాఠశాలలు, కళాశాలలకు బ్యాగులు సర్దుకుని సోమవారం ఉదయాన్నే బయలుదేరారు. దీంతో కడపలోని ఆర్టీసీ బస్టాండు విద్యార్థినీ, విద్యార్థులతో కిటకిటలాడింది. వారు వెళ్ళాల్సిన ప్రదేశాల బస్సుల రాక కోసం వేచి చూశారు. 

190 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు విచ్చేసిన ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు కడప రీజియన్‌ పరిధిలోని కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేల్‌, రాయచోటి, పులివెందుల డిపోల నుంచి సుమారు 190 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పండగ సెలవులు అయిపోవడంతో ప్రజలు, విద్యార్థులు తిరుగు ప్రయాణమయ్యారు. వీరందరినీ సురక్షితంగా వారి వారి గమ్మస్థానాలకు చేరవేసేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.


Updated Date - 2022-01-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising