ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్‌షెల్టర్‌ లేక ఇక్కట్లు

ABN, First Publish Date - 2022-07-01T05:16:15+05:30

కడప- రాయచోటి 40వ జాతీయ రహదారిలోని రామాపురం బస్సు స్టేజీ వద్ద బస్‌షెల్టర్‌ లేక ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, వీరబల్లి మండలాలకు చెందిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు కడపకు వెళ్లాలంటే ఆ బస్టాపు వద్దకు రావాల్సి ఉంది.

బస్‌షెల్టర్‌ లేక ఎండలో నిలబడి ఉన్న ప్రయాణికులు, ప్రభుత్వ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామాపురం, జూన్‌ 30:  కడప- రాయచోటి 40వ జాతీయ రహదారిలోని రామాపురం బస్సు స్టేజీ వద్ద బస్‌షెల్టర్‌ లేక ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, వీరబల్లి మండలాలకు చెందిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు కడపకు వెళ్లాలంటే ఆ బస్టాపు వద్దకు రావాల్సి ఉంది.  అయితే ఇక్కడ ప్రయాణికులు వేచి ఉండేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నారు. ఇక్కడ కనీసం కూర్చునేందుకు కూడా ఎలాంటి అవకాశం లేక పోవడంతో ఎంతసేపైనా నిలుచునే ఉండాల్సి వస్తోంది. దీంతో గర్భిణులు, వికలాంగులు, వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా రామాపురం బస్టాప్‌ వద్ద బస్‌షెల్టర్‌ ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

బస్‌ షెల్టర్‌ ఏర్పాటు చేయాలి

రామాపురం బస్టాపు వద్ద బస్‌షెల్టర్‌ లేక ఎండలో ఎండుతూ, వర్షంలో తడుస్తూ బస్‌ కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఉద్యోగులు, విద్యా ర్థులు, గర్భిణీలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించాలి.  

- చంద్రయ్య, ప్రయాణికుడు

Updated Date - 2022-07-01T05:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising