ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలియుగ దానకర్ణుడు బుడ్డా వెంగళరెడ్డి

ABN, First Publish Date - 2022-12-31T23:41:26+05:30

బుడ్డా వెంగళరెడ్డి తన యావదాస్తిని దానధర్మాల కోసం వెచ్చించి కలియుగ దానకర్ణుడిగా గుర్తింపు పొందారని రేనాటి సూర్యచంద్రుల సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ వైవీ స్వరూ్‌పకుమార్‌రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు టంగుటూరు మారుతిప్రసాద్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 31 : బుడ్డా వెంగళరెడ్డి తన యావదాస్తిని దానధర్మాల కోసం వెచ్చించి కలియుగ దానకర్ణుడిగా గుర్తింపు పొందారని రేనాటి సూర్యచంద్రుల సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ వైవీ స్వరూ్‌పకుమార్‌రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యుడు టంగుటూరు మారుతిప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం బుడ్డా వెంగళరెడ్డి 122వ వర్ధంతిని పురస్కరించుకుని కొర్రపాడు రోడ్డులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమలో కరువు ఏర్పడినప్పుడు బుడ్డా వెంగళరెడ్డి పేద ప్రజలకు అన్నదానం చేసి ఆదుకున్నారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించిన బ్రిటిష్‌ రాణి బంగారు పతకాన్ని బహూకరించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక నాయకుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, నాయకులు కొండారెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, గజ్జల వెంకటేశ్వరరెడ్డి, ఓబుళరెడ్డి, మునిరెడ్డి,, పద్మవీరన్న, బుడ్డా వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:41:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising