ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఆర్థికాభివృద్ధికి విస్తృత సేవలు : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-08-12T05:19:53+05:30

జిల్లాలో వ్యవసాయ, పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నామ ని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయరామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(రూరల్‌), ఆగస్టు 11 : జిల్లాలో వ్యవసాయ, పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నామ ని కలెక్టర్‌ విజయరామరాజు పేర్కొన్నారు. గురువారం మంగళగిరి నుంచి కమిషనర్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ సొపైటీ, రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ కమిషనర్‌ అహ్మద్‌బాబు, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రత్యామ్నా సంబంధిత అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈకార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, డీఆర్‌వో రామమోహన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్ర సహకార సంఘం, నాబార్డు ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ, పాడి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తగు చర్యలు చేపడుతున్నామన్నారు. రెండవ విడతలో భాగంగా జిల్లాకు 62 మల్టీపర్సన్‌ ఫెసిలిటీస్‌ సెంటర్లు మంజూరు కాగా 52 గోడౌన్లకు స్థలాన్ని కేటాయించామని, మిగిలిన వాటికి స్థల సేకరణ జరుగుతోందన్నారు. మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో కేటాయించిన 15 గోడౌన్లు గ్రౌండింగ్‌ ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. జిల్లా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 258 బల్క్‌ మిల్క్‌ యూనిట్లకు గాను 252 యూనిట్లకు స్థలాన్ని కేటాయించామని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయని తెలియపరిచారు. ఈ సమావేశంలో జిల్లా కో-ఆపరేటివ్‌ అధికారి సుభాషిణి, పశుసంవర్ధకశాఖ జేడీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-08-12T05:19:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising