ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిపాలు బిడ్డకు శ్రీరామరక్ష

ABN, First Publish Date - 2022-08-07T04:59:32+05:30

తల్లిపాలే బిడ్డ ఆరోగ్యానికి శ్రేయస్కరమని రూరల్‌ ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ కళావతి పేర్కొన్నారు. శనివారం స్థానిక స్వరాజ్యనగర్‌, సంజీవ్‌నగర్‌లో తల్లి పాల ప్రాముఖ్యతపై అంగన్‌వాడీ వర్కర్లు, తల్లులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

ప్రొద్దుటూరు స్వరాజ్యనగర్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న అంగన్‌వాడీ వర్కర్స్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌ ఆగస్టు 6 : తల్లిపాలే బిడ్డ ఆరోగ్యానికి శ్రేయస్కరమని రూరల్‌ ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ కళావతి పేర్కొన్నారు. శనివారం స్థానిక స్వరాజ్యనగర్‌, సంజీవ్‌నగర్‌లో తల్లి పాల ప్రాముఖ్యతపై అంగన్‌వాడీ వర్కర్లు, తల్లులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ముర్రుపాలలో ఎన్నో రకాల ఔషధగుణాలుంటాయన్నారు ఈ సందర్బంగా వార్డులో ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్సించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు సుజాత, గౌసియా, శాంత, కుమారి, పార్వతి ఆశ వర్కర్లు జయలక్ష్మీ, రామాంజనమ్మ పాల్గొన్నారు. 

ప్రొద్దుటూరు రూరల్‌..: మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రాజీవ్‌నగర్‌, శ్రీనివాసపురం, ఈశ్వర్‌రెడ్డినగర్‌లలో శనివారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా కామనూరు ప్రాథమిక వైద్యాధికారులు, సిబ్బంది తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్‌ హనీ్‌ఫబాబా మాట్లాడుతూ ఆరోగ్యశాఖ, సమగ్ర శిశు అభివృద్ధి శాఖ సమన్వయంతో చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో కృష్ణమ్మ, సూపర్‌వైజర్‌ బీఏ వరప్రసాద్‌, ఎంఎల్‌హెచ్‌టీ నరసింహ, ఆరోగ్య కార్యకర్త దీప్తి, ఆశా వర్కర్లు పోలమ్మ, మేరీ పాల్గొన్నారు.

ఎర్రగుంట్ల..: తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష అని పీహెచ్‌సీ హెచ్‌ఈవో నాగమునిరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ తల్లిపాలవారోత్సవాల సందర్భంగా శనివారం చిలమకూరు పీహెచ్‌సీ పరిధిలోని చిర్రాజుపల్లె గ్రామంలో తల్లులు, గర్భిణులతో పీహెచ్‌సీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌లు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. 

ఫతల్లిపాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయని ఎర్రగుంట్లనగరపంచాయతీలో గర్భిణు లు,తల్లులకు  శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీ కార్యకర్తలు లక్ష్మి, కుసుమావతి, లక్ష్మీకళావతి, ఉమాదేవి  పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T04:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising