ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిచ్చికుక్క దాడిలో బాలుడికి గాయాలు

ABN, First Publish Date - 2022-07-04T04:51:05+05:30

స్థానిక 33వ వార్డు లక్ష్మీనరసింహ సినిమా హాలు వెనుకవైపు ఉన్న కాలనీలో ఓ బాలుడిపై ఆదివారం పిచ్చికుక్క దాడి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బద్వేలు రూరల్‌,  జూలై 3: స్థానిక 33వ వార్డు లక్ష్మీనరసింహ సినిమా హాలు వెనుకవైపు ఉన్న కాలనీలో ఓ బాలుడిపై ఆదివారం పిచ్చికుక్క దాడి చేసింది. ఘటనలో బా లుడు తీవ్రగాయాల పాలయ్యాడు. ఇదే కుక్క యాదవ నగర్‌లోని మరో మహిళను, రాజుగారి వీధిలో మరొక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. పిచ్చికుక్క కొంత కాలంగా ఈ ప్రాంతంలో తిరుగుతూ పలువురిపై దాడి చేస్తోందని ఈ సమస్యపై మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయినా వారు ఇంత వరకూ చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి పిచ్చి కుక్కను తరిమేయాలని స్థానికులు కోరుతున్నారు. 

ఆరవేటిపల్లెలో నలుగురికి.....

ముద్దనూరు జూలై3:  ఆరవేటిపల్లెలో ఆదివారం నలుగురిపై పిచ్చికుక్కదాడి చేసి గాయపరిచినట్లు సమాచారం. మహదేవనాయుడు, వెంకటరమణ, రామచంద్ర, పెద్దగంగన్నను పిచ్చికుక్కగాయపరచడంతో జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. మహదేవనాయుడుకు భారీగా గాయాలవడంతో చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం రెఫర్‌చేసిట్లు తెలిసింది.


Updated Date - 2022-07-04T04:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising