గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
ABN, First Publish Date - 2022-10-18T04:59:22+05:30
పోట్లదుర్తి సమీపాన పెన్నానదిలో ఆదివారం గల్లంతైన టి.కార్తీక్, వై.వసంత్ అనే ఇద్దరు యువకులు మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఎర్రగుంట్ల, అక్టోబరు 17: పోట్లదుర్తి సమీపాన పెన్నానదిలో ఆదివారం గల్లంతైన టి.కార్తీక్, వై.వసంత్ అనే ఇద్దరు యువకులు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరి ఆచూకీ కోసం ఆదివారం చీకటి పడేవరకు వెతికినా ఎక్కడా కనిపించలేదు. దీంతో సోమవారం ఉదయం ప్రొద్దుటూరు ఆగ్ని మాపక రెస్క్యూ టీం బోటు సహాయంతో వెతికారు. ఒకరి మృతదేహం బ్రిడ్జి సమీపంలోని పిల్లర్ వద్ద లభించగా.. మరో మృతదేహం సమీ పంలోని కంపచెట్ల వద్ద గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారి బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ నరసయ్య తెలిపారు. కార్యక్రమంలో అగ్నిమాపక జిల్లా సహాయ అధికారి ఎ.రఘునాథ్, సిబ్బంది ఎస్.అన్వర్‌బాషా, సి.శ్రీనివాసలరెడ్డి, కె.శ్రీని వాసులు, నాగేంద్రారెడ్డి, కుమారస్వామి, నరేంద్రకుమార్, హరిక్రిష్ణ, నీల కంఠ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:59:22+05:30 IST