ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ పాదయాత్రతో బీజేపీ పతనం

ABN, First Publish Date - 2022-08-05T04:52:58+05:30

జాతీయ కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాం ధీ పాదయాత్రతో బీజేపీ పతనం తప్పదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి జోస్యం పలికారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెప్టెంబరు 1 నుంచి 3571 కి.మీ పాదయాత్ర

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి

కడప(కలెక్టరేట్‌) ఆగస్టు4: జాతీయ కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాం ధీ పాదయాత్రతో బీజేపీ పతనం తప్పదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి జోస్యం పలికారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్‌ సెప్టెంబరు 1 పాదయాత్ర  ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర రోజుకు 25 కిలో మీటర్ల వరకు సాగనుందన్నారు. మొత్తం మీద 3571 కిలో మీటర్ల మేర 148 రోజులు పాదయాత్ర సాగుతుందన్నారు. 12 రా ష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా  68 లోక్‌సభ, 203  అసెంబ్లీ నియోజక వర్గాల్లో రాహుల్‌ పాదయాత్ర సాగనుందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాహుల్‌ పాదయాత్ర 4 రోజులు 100 కిలో మీటర్లు సాగనుందన్నారు. ఇందులో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గంలోని ఓబులాపురం మీదుగా బళ్లారి, కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, పెద్దకుంబళం, యాదవరం, మీదుగా  కర్ణాటకలోని రాయచూర్‌లోకి పాదయాత్ర చేరుతుందన్నారు. మోదీ నిరంకుశ పా లన, విభజించు పాలించు రీతిలో సాగుతున్న పాలనపై ప్రజల్లో మ రింత చైతన్యం తీసుకురావడం పాదయాత్ర ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు నజీర్‌ అహమ్మద్‌, రాష్ట్ర ఎస్సీసెల్‌ వైస్‌ చైర్మెన్‌ ఎం.విజయ బాస్కర్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తిరుమలేశు, కాంగ్రెస్‌ నేతలు నాసీర్‌ ఖాన్‌, జోడు నాగరాజు, సుబ్బారెడ్డి, మైనుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T04:52:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising