ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN, First Publish Date - 2022-09-29T05:13:29+05:30

మెరుగైన వైద్య సేవలు అందించాలి

సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ కొండయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్కిరెడ్డిపల్లె, సెప్టెంబరు 28: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అ న్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎన్‌. కొం డయ్య ఆదేశించారు. బుధవారం కోనం పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయ న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందు గా రికార్డులు, అధికారుల పనితీరుపై ఆరాతీశారు.  కోనంపేట పీహెచ్‌ ప్రాంతా ల్లో జ్వరాలు ప్రబలుతున్నాయని, డాక్టర్లు అందుబాటులో ఉండి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందించాలన్నారు. మాతాశిశు సంరక్షణ సేవలు, వ్యాధి నిరోధక టీకాలు, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌, అనీమియా ముక్తభారత్‌ తదితర కార్యక్రమాల్లో లక్ష్యాలను సాధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఇంతవరకు ఎన్ని కాన్పులు చేశారని ఆయన డాక్టర్లను అడిగారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ప్రో గ్రాం అధికారులు డాక్టర్‌ రియాజ్‌బేగ్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధి కారులు సిద్దయ్య, రిజ్వాన్‌, సీహెచ్‌వో రవీంద్ర, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ బలరామరాజు, జూనియర్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌, స్టాఫ్‌ నర్సులు సతీష్‌, రేణుక, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రమణ, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-29T05:13:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising