అగ్గి తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలి
ABN, First Publish Date - 2022-10-08T04:44:42+05:30
అగ్గి తెగులు పట్ల అప్రమ త్తంగా ఉండాలని ఏవో సురే్‌షరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని లింగారెడ్డిపల్లె గ్రామంలో వరి పంటను పరిశీలించారు.
కలసపాడు, అక్టోబరు 7 : అగ్గి తెగులు పట్ల అప్రమ త్తంగా ఉండాలని ఏవో సురే్‌షరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని లింగారెడ్డిపల్లె గ్రామంలో వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటలో అగ్గితెగులు సోకితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇప్పటికే మండలంలో పలు ప్రాంతాల్లో అగ్గి తెగులు గుర్తించామన్నారు. అగ్గి తెగులు సోకితే ఆకుల పై నల్ల మచ్చలు వచ్చి ఆకులు ఎర్రబారుతాయని, దీంతో పంట దిగుబడి 50 శాతం మేర తగ్గిపోతుందన్నారు. అగ్గి తెగులు సోకిన పంటకు టిబినోజోల్ పైప్లోస్కోపోజిన్ అనే మందును 200 ఎంఎల్ ఎకరాకు పిచికారి చేస్తే ఫలితం ఉంటుందన్నారు. అలాగే అక్కడక్కడా జింక్ లోపం కూడా కనిపిస్తోందని సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో లింగారెడ్డిపల్లె గ్రామ వ్యవసాయాఽధికారి ఉమ మహేశ్వరి, రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T04:44:42+05:30 IST