ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలపై ‘బాదుడే.. బాదుడు’

ABN, First Publish Date - 2022-05-23T05:39:18+05:30

మండలంలో రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని బొమ్మవరం, బి.పి.రాచపల్లె, వై.కోట గ్రామాల్లో టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కలిగించేందుకు గ్రామ గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న విశ్వనాధనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు

ఓబులవారిపల్లె, మే 22: మండలంలో రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని బొమ్మవరం, బి.పి.రాచపల్లె, వై.కోట గ్రామాల్లో టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కలిగించేందుకు గ్రామ గ్రామాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా విశ్వనాధనాయుడు మాట్లాడుతూ పేదవాడికి ఏం మేలు జరిగిందని, ప్రతి దాంట్లోనూ బాదుడే బాదుడు అని ఎద్దేవా చేశారు. రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ని ఇస్తామని చెప్పి 7గంటలు చేశారన్నారు. అందులోనూ కోతలు విధించి రైతుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మండలంలోని మాజీ జడ్పీటీసీ నాయుడోరి రమణ, బోటుమీదపల్లె యువనాయకులు రెడ్డయ్యనాయుడు, వెంకటయ్యనాయుడు, వై.కోట నాయకులు మాజీ సర్పంచ్‌ బాలాజీ, కమతం నాగరాజు, రమణారెడ్డి, మహిళానాయకురాలు అనిత దీప్తి, టీడీపీ, పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. 


దళితులపై దాడులను ఖండిస్తున్నాం 

పుల్లంపేట, మే 22: వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దళితులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి దళితుల మీద దమనకాండ చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అన్యాయాలకు గురవుతున్న దళిత కుటుంబాలకు న్యాయం జరగాలని వారికి అండగా నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడతామన్నారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు చేతపట్టి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఆరే సుధాకర్‌, ఉపాధ్యక్షుడు కాపెర్ల చంద్రశేఖర్‌ నాయుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త విశ్వేశ్వరనాయుడు, తెలుగు యువత అధ్యక్షుడు దేవరకొండ నవీన్‌, పోతినేని భరత్‌, బి.మహే్‌షబాబు, ఆర్‌ఎంపీ నాగరాజు, కాకర్ల ప్రభాకర్‌, చండు ఈశ్వర్‌, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T05:39:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising