ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీల్లో కార్యక్రమాలపై అవగాహన అవసరం

ABN, First Publish Date - 2022-09-22T04:44:46+05:30

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలు పరిచే కార్యక్రమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యు లు ముడిమెల లక్ష్మీదేవి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యులు 


రాయచోటి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 21: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అమలు పరిచే కార్యక్రమాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యు లు ముడిమెల లక్ష్మీదేవి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌ స్పందన హాల్‌లో అన్నమయ్య జిల్లాలో ఉన్న 8 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ శాఖలోని పథకాలు, వాటి లాభాలపై అవగాహన కల్పించారు. ప్రతి బాలింత, గర్భీణికి, 6 ఏళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అం దాలని సూచించారు. ఇందులో భాగంగా బాల్య వివాహాల నియంత్రణలో అన్ని శాఖలను ఎలా సమన్యయం చేసుకోవాలో తెలిపా రు. మహిళాపోలీస్‌ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలో బాలల పరిరక్షణ సమితులను ఏర్పాటు చేసి... వాటి ద్వారా బాలల పరిరక్షణను పర్యవేక్షించాలన్నారు. లైంగిక వేధింపుల నుంచి బాలలను కాపాడేందుకు మహిళా పోలీస్‌, అంగన్‌వాడీవర్కర్‌ ద్వారా మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల రక్షణ విషయంలో స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ నిర్మల, సూపర్‌వైజర్లు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి శుభా్‌షయాదవ్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-22T04:44:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising