ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలి

ABN, First Publish Date - 2022-10-04T05:40:49+05:30

విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసు కుంటున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, భానుమూర్తి అన్నారు. సోమవారం రాయచోటిలోని డైట్‌ పాఠశాలలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై సమావేశం నిర్వహించారు.

ఉపాధ్యాయ సమావేశంలో మాట్లాడుతున్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బకాయిలు తక్షణం చెల్లించాలి

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, భానుమూర్తి

రాయచోటిటౌన్‌, అక్టోబరు 3: విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసు కుంటున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మంజుల, భానుమూర్తి అన్నారు. సోమవారం రాయచోటిలోని డైట్‌ పాఠశాలలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులపై కక్షగట్టింద న్నారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్‌ నిలబెట్టు కోవాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర సంద ర్భంగా సీపీ ఎస్‌ను రద్దు చేస్తానని, పీఆర్‌సీని న్యాయపరంగా ఇస్తానని చెప్పిన జగన్‌ అధికారం లోకి వచ్చాక మాట మార్చి విద్యా వ్యతిరేక విధానాలను అవలం బిస్తూ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడు తున్నారని ఆరోపిం చారు. డీఏ, పీఎఫ్‌, ఈఐలను తక్షణమే చెల్లించా లని డిమాండ్‌ చేశారు. అనం తరం ఏపీటీఎఫ్‌ అన్నమయ్య జిల్లా నూతన ఉపాఽ ద్యక్షుడుగా అబ్బవరం హరిబాబును ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యాంసుందర్‌రెడ్డి, అశోక్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు, ఏపీటీఎఫ్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామదస్తగిరిరెడ్డి, శ్రీనివాసులు, నాయకులు అదిబయన్న, రాజశేఖర్‌, శేషారావు, రమేష్‌, శ్రీను, రామాంజనేయులు, ఆర్‌వీ రమణ, అబ్బవరం రాయుడు, మల్లూరు నాగరాజు, రెడ్డెయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-04T05:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising