ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తపాలాశాఖ ప్రైవేటీకరణ యత్నాలు విరమించాలి

ABN, First Publish Date - 2022-08-11T04:39:13+05:30

కేంద్ర ప్రభుత్వం తపాలశాఖ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని తపాలా ఉద్యోగులు సం ఘం నాయకులు వెంకటరమణ, మూర్తి, రెడె ్డప్ప, అమరనాద్‌ డిమాండ్‌ చేశారు.

మదనపల్లె: ధర్నా చేస్తున్న తపాలా శాఖ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె అర్బన్‌, ఆగస్టు 10: కేంద్ర ప్రభుత్వం తపాలశాఖ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని తపాలా ఉద్యోగులు సం ఘం నాయకులు వెంకటరమణ, మూర్తి, రెడె ్డప్ప, అమరనాద్‌ డిమాండ్‌ చేశారు. బుధ వారం హెడ్‌ఫోస్టాఫీస్‌ వద్ద ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపాలాశాఖ ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్ని స్తోందన్నారు. రూ. 30 కోట్లు చిన్నమొత్తాలు, రూ 13 లక్షల కోట్లకు పైగా పొదుపు ఖాతాల్లో ఉన్న నగదును, పోస్టల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు, స్పీడ్‌ పోస్టుల వంటి లాభదాయకమైన సేవ లను ఐపీపీబీకి బదలాయించడానికి రోడ్‌ మ్యాప్‌ విడుదల చేసిందన్నారు. ప్రభుత్వ ఆధీ నంలోని తపాలాశాఖపై నమ్మకంతో ప్రజలు ఎన్నో ఏళ్లుగా పొదుపు చేసుకున్న సొమ్మును కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తే తపాలా శాఖ మనుగడ సాగించడం కష్టమన్నారు. దీం తో ఎన్‌ఎఫ్‌పీఈ, ఎఫ్‌ఎన్‌ఫీవోల జేఏసీగా ఆధ్వర్యంలో బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె కు పిలుపు నిచ్చాయన్నారు. లేబర్‌ కోడ్‌ రద్దు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ యత్నం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. యూనియన్‌ నాయకులు వెంకటరమణమూర్తి, రెడ్డెప్ప, అమరనాథ్‌, నటరాజ, కుమార్‌, రామాంజులు, కుమారస్వామి, మల్లికార్జున, ఉమాదేవి, ఉషా, తదితరులు పాల్గొన్నారు.  

పీలేరు: తపాలాశాఖ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ బుధవారం పీలేరులోని తపాలా ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి సమ్మె చేశారు. . ఈ సందర్భంగా పోస్టుమాస్టర్‌ వై.శేషాద్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చాప కింద నీరులా చేపడుతున్న తపాలా శాఖ ప్రైవేటీక రణను అడ్డుకునేందుకు చేపట్టిన సమ్మెలో భాగంగా తాము విధులను బహిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోస్టుమాస్టర్లు జయ, వినోద్‌ కుమార్‌, నరేశ్‌, గణేశ్‌, రెడ్డప్ప, రమేశ్‌ బాబు, విశ్వనాథం తదితరులు పాల్గొ న్నారు. 

Updated Date - 2022-08-11T04:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising