ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నిర్మూలనకు సహకరించాలి

ABN, First Publish Date - 2022-01-21T05:30:00+05:30

రోజురోజుకు విజృంభిస్తున్న కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని నల్లపురెడ్డిపల్లె పీహెచ్‌సీ మండ ల వైద్యాధికారి ప్రదీప్‌ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

కళాశాల సిబ్బంది నుంచి శాంపిల్‌ సేకరిస్తున్న వైద్యసిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యాక్సిన్‌ వేసుకున్నా నిర్లక్ష్యం వద్దు

పులివెందుల రూరల్‌, జనవరి 21: రోజురోజుకు విజృంభిస్తున్న కొవిడ్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని నల్లపురెడ్డిపల్లె పీహెచ్‌సీ మండ ల వైద్యాధికారి ప్రదీప్‌ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. పులివెందుల పట్టణంతో పాటు మండలంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాల ల్లో ఇది వరకే కొవిడ్‌ కేసులు నమోదైన దృష్ట్యా శుక్రవారం కొవిడ్‌ నిర్ధారణ టెస్టులు చేశారు. ఇది వరకే కేసులు నమోదైనప్పటికీ ఇంతవరకు తమ కు ఎందుకు తెలియజేయలేదని, ఈ నిర్లక్ష్యం కా రణంగా మరింత మంది కొవిడ్‌ బారిన పడే అవకాశం ఉందని తెలియదా అని పాఠశాలల యా జమాన్యాన్ని ప్రశ్నించారు. అనంతరం డాక్టర్‌ ప్ర దీప్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ శుక్రవారం ని ర్వహించిన పరీక్షల్లో 28 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. నల్లపురెడ్డిపల్లె పీహెచ్‌సీ పరిధిలో ఈనెల 14 నుంచి 21వ తేదీ వరకు ప్రభు త్వ లెక్కల ప్రకారం 70 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. కొంతమంది బయట ల్యాబ్స్‌, ఆసుపత్రులల్లో టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్‌ కేసులు వందల సంఖ్యలో న మోదైనట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కావున ప్రజలు ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరంలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే తప్పకుండా కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్నా కొవిడ్‌ ని బంధనలు పాటించాల్సిందేనని హెచ్చరించారు. 

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising