ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైన్‌స్నాచింగ్‌ కేసులో... కీలక నిందితుని అరెస్టు

ABN, First Publish Date - 2022-07-02T05:24:50+05:30

రెండవ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో గత నెల 9న నమోదైన చైన్‌స్నాచింగ్‌ కేసుకు సంబంధించి శుక్రవారం కీలక నిందితుడు గువ్వల పుల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాదరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

35 గ్రాముల బంగారు సరుడు స్వాధీనం


ప్రొద్దుటూరు క్రైం, జులై 1 : రెండవ పట్టణ పోలీ్‌సస్టేషన్‌లో గత నెల 9న నమోదైన చైన్‌స్నాచింగ్‌ కేసుకు సంబంధించి శుక్రవారం కీలక నిందితుడు గువ్వల పుల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం టుటౌన్‌ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ వై.ప్రసాదరావు వివరాలను వెల్లడించారు. ఎర్రగుంట్ల బైపాస్‌లో పానీపూరీ వ్యాపారం నిర్వహించే రెడ్డయ్య తన భార్యతో కలిసి గతనెల 9వ తేదీ రాత్రి స్కూటీలో ఇంటికి వెళ్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని బంగారు సరుడును లాక్కెళ్లారు. ఈ కేసుకు సంబంధించి గతనెల 13న గంప వెంకటరమణను అరెస్టు చేశామని,  కీలక నిందితుడైన మైలవరం మండలం నక్కోనిపల్లెకు చెందిన గువ్వల పుల్లారెడ్డి పరారీలో ఉన్నారన్నారు. రాబడిన సమాచారంతో సీఐ ఇబ్రహీం నేతృత్వంలో ఎస్‌ఐ భాస్కర్‌ తన సిబ్బందితో కలిసి హౌసింగ్‌బోర్డు కాలనీ పెద్దమ్మ చెట్టు వద్ద పుల్లారెడ్డిని అరెస్టు చేసి, అతని నుంచి 35 గ్రాముల బంగారు సరుడును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. పుల్లారెడ్డి అరెస్టులో శ్రమించిన సిబ్బంది దామోదర్‌, నరసింహనాయుడులను డీఎస్పీ అభినందిస్తూ, నగదు ప్రొత్సాహకాన్ని అందించారు.  

 

Updated Date - 2022-07-02T05:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising