ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్‌రాష్ట్ర దొంగల అరెస్టు

ABN, First Publish Date - 2022-07-07T04:18:46+05:30

జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల ప్రాంతాల్లోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, దారి దోపిడీలు, చైన స్నాచింగ్‌ కేసుల్లో రెండు ముఠాలకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి, వారి నుంచి దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన తెలిపారు.

అరెస్టైన వారితో ఎస్పీ అన్బురాజన, పోలీసు అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

434 గ్రాముల ఆభరణాలు, రూ.45 వేల నగదు, రెండు  బైకులు స్వాధీనం  

నిందితుల్లో కర్ణాటక, ఏపీ ముఠాల సభ్యులు

కడప(క్రైం),  జూలై 6 : జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల ప్రాంతాల్లోని పలు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, దారి దోపిడీలు, చైన  స్నాచింగ్‌ కేసుల్లో రెండు  ముఠాలకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి, వారి నుంచి దాదాపు రూ.20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ కాన్ఫరెన్సహాల్లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.  కర్ణాటక రాష్ట్రం రాయచూరు, బాగల్‌కోట్‌ జిల్లాకు చెందిన  రమేష్‌, సుంకప్ప  పులివెందుల అర్బన పోలీస్‌ స్టేషన పరిధిలో జరిగిన నాలుగు ఇళ్ల దొంగతనాలు, దారిదోపిడీ, చైన స్నాచింగ్‌ కేసుల్లో నిందితులు. రాషా్ట్రనికి చెందిన మల్లికా శ్యామల, మల్లికా వెంకటేష్‌,  మల్లికా ఇరుపురం, మల్లికా అంజి, మ ల్లికా ఇంద్ర, రాగి నాగరాజు అనంతపురంలో 7 చైనస్నాచింగ్‌ కేసుల్లో నిందితులు. ఈ ముఠాలో ఉన్న ఓ బాలుడిని కడప జువెనైల్‌ జస్టిస్‌బోర్డు ఎదుట హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. వీరి నుంచి 59 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాషా్ట్రనికి చెందిన మల్లికా శ్యా మల, మల్లికా వెంకటేష్‌,  మల్లికా ఇరువరంరాజు, మల్లికా అంజి, మల్లికా ఇంద్ర, రాగి నాగరాజును అరెస్టు చేసి, వారి నుంచి 175.11 గ్రాముల బంగా రు ఆభరణాలు,  ఒక  ద్విచక్రవాహనం స్వాఽధీనం చేసుకున్నట్లు తెలిపారు. కడప వనటౌన పరిధిలో దొంగతనం కేసులో రూ.5 లక్షల విలువైన బంగా రు, వెండి ఆభరణాలు, మోటార్‌ బైక్‌ స్వాధీనం చేసుకుని సాయి కుమార్‌ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.  దొంగలను అరెస్టు చేయడంలో కృషి చేసిన పులివెందుల రూరల్‌ సీఐ బాల మద్దిలేటి, కడప వనటౌన  సీఐ నాగరాజు,  అర్బన  సీఐ రాజు, వేముల ఎస్‌ఐ ధనుంజయుడు,  ఎస్‌ఐ గోపీనాథ్‌,  ఐడీ పార్టీ సిబ్బందిని నగదు రివార్డులతో ఎస్పీ అభినందించారు. 

Updated Date - 2022-07-07T04:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising