ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి అరెస్టు

ABN, First Publish Date - 2022-05-18T05:30:00+05:30

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు తెచ్చి విక్రయిస్తు న్న యువకుడు ఆకిబ్‌ హుస్సేన్‌ రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి కర్నాటక, గోవా రాష్ట్రాలకు చెందిన 332 మద్యం బాటిళ్లు, 192 టెట్రా ప్యాకెట్లు, రవాణాకు ఉపయోగించిన స్కూ టీని సీజ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో రూరల్‌ ఎస్‌ఐలు సంజీవరెడ్డి, హైమావతి వెల్లడించిన వివరాల్లోకెళితే....

స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లతో ఎస్‌ఐలు, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్కూటీ సహా 332 మద్యం బాటిళ్లు, 192 టెట్రా ప్యాకెట్లు సీజ్‌

ప్రొద్దుటూరు క్రైం, మే 18: ఇతర రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు తెచ్చి విక్రయిస్తు న్న యువకుడు ఆకిబ్‌ హుస్సేన్‌ రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి  అతని నుంచి కర్నాటక, గోవా రాష్ట్రాలకు చెందిన 332 మద్యం బాటిళ్లు, 192 టెట్రా ప్యాకెట్లు, రవాణాకు ఉపయోగించిన స్కూ టీని సీజ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో రూరల్‌ ఎస్‌ఐలు సంజీవరెడ్డి, హైమావతి వెల్లడించిన వివరాల్లోకెళితే.... 

 డిప్లొమా పూర్తి చేసిన ఆకిబ్‌ ఉద్యోగం రాక, అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు సిద్దమయ్యాడు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కర్నాటక రాష్ట్రం బాగేపల్లి, గోవా రాష్ట్రాల నుంచి మద్యం బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు తెచ్చి విక్రయిస్తున్నాడు. రాబడిన సమాచారంతో సిబ్బంది లింగాపురంలోని పాత ఆటోనగర్‌లో వెల్డింగ్‌ షాపు సమీప కం పచెట్ల వద్ద అతన్ని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. టీచర్స్‌ కాలనీకి చెందిన ఆకిబ్‌ హుస్సేన్‌ ప్రస్తుతం ఖాదరబాదు వైట్‌హౌస్‌ దగ్గర నివాసముంటున్నట్లు తెలిసిందన్నారు. 

దీంతో కంపచెట్లలో దాచి ఉంచిన 73 మాన్‌సూన్‌హౌస్‌ బ్రాంది బాటిళ్లు, 9 ఓల్డ్‌ ఆడ్మిరల్‌ బ్రాంది బాటిళ్లు, 250 రీల్స్‌ విస్కీ బాటిళ్లు, 192 కర్నాటక హైవార్డ్స్‌ విస్కీ టెట్రా ప్యాకెట్లు, రవాణాకు ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐలు తెలిపారు.  అకిబ్‌ హుస్సేన్‌ను అరెస్టు చేశామని, ఇందులో సహకరించిన మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising