ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం పర్యటన ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-12-16T23:17:00+05:30

ఈ నెల 23న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఉన్నందున ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టరు విజయరామరాజు అన్నారు.

సభా స్థలాన్ని పరిశీలిస్తున్న కలెక్టరు విజయరామరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమలాపురం రూరల్‌, డిసెంబరు 16: ఈ నెల 23న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఉన్నందున ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టరు విజయరామరాజు అన్నారు. శుక్రవారం సీఎ్‌సఐ గ్రౌండులో సభ స్థలాన్ని హెలీప్యాడ్‌ను జేసీ సాయికాంత్‌వర్మ, ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డితో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ 23న కమలాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు సీఎం పర్యటన ఉంటుందన్నారు. ఈ పర్యటనలో భాగంగా సభా స్థలాన్ని ప్రజలకు అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు.

హెలీ ప్యాడ్‌ కూడా సభాస్థలానికి దగ్గరలో ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక రాజకీయ నాయకులు కూడా సహకరించాలన్నారు. కార్యక్రమంలో హార్టికల్చర్‌ రాష్ట్ర సలహాదారుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, తహసీల్దారు అమరేశ్వరి, ఎంపీడీఓ శేషాచలపతి, నగర కమిషనర్‌ రాజశేఖర్‌, మార్కెట్‌ యార్డు కమిటీ ఛైర్మన్‌ ఎన్‌సీ పుల్లారెడ్డి, వైసీపీ నేతలు మస్తానయ్య, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising