ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం
ABN, First Publish Date - 2022-10-08T04:28:24+05:30
: ప్రజా ప్రతినిధుల న డుమ వాగ్వాదం, అరుపులు కేకల నడుమ అభివృద్ధి సమావేశం రసాభాసగా జరిగింది.
ఎమ్మెల్యే సాక్షిగా అరుపులు కేకలతో రసాభాసగా మండల సమావేశం
ఒంటిమిట్ట, అక్టోబరు7: ప్రజా ప్రతినిధుల న డుమ వాగ్వాదం, అరుపులు కేకల నడుమ అభివృద్ధి సమావేశం రసాభాసగా జరిగింది. శుక్రవారం రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లి కార్జునరెడ్డి ఆధ్వర్యంలో మండల సమావేశం జరిగింది. ఇందులో సభ్యులు లెవనెత్తిన సమస్యలు ప్రశ్నించే క్రమంలో పెన్నపేరూరు ఎంపీటీసీ ముమ్మడి నారాయణరెడ్డి, గొల్లపల్లె సర్పంచ్ దున్నపోతుల లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున అరుపులు కేకలతో వా గ్వాదం చేసుకోవడంతో ఎమ్మెల్యే, అధికారులు కలగజేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
పారిశుధ్య సమస్యపై ఇద్దరూ నువ్వెంత అనే స్థాయికి వేసిన కేకలతో గందరగోళం ఏర్ప డింది. ఇదిలా ఉండగా గ్రామాల్లో పారి శు ధ్యం, తాగునీరు, విద్యుత్, మౌలిక వసతు ల పై అధికారులు దృష్టి సారించాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూ చించారు. మండల కేంద్రంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పూర్తి చేయాలని అందు కు తగ్గ నిధులను మంజూరు చేయిస్తానని ఆయన అధికారులకు సూచించారు. తహసీ ల్దారు శ్రీనివాసులరెడ్డి, స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య, ఇన్‌చార్జి ఎంపీపీ జనార్ధ న్‌రెడ్డి, ఎంపీడీఓ రంగయ్య, ఎంపీటీసీలు నారాయ ణరెడ్డి, బోగా గీత, రాష్ట్ర డైరెక్టర్లు ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, కో-ఆ ప్షన్ సభ్యుడు రఫీ, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T04:28:24+05:30 IST