ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోధనకు ఆటంకంగా మారిన యాప్‌లను రద్దు చేయాల్సిం

ABN, First Publish Date - 2022-08-19T05:05:53+05:30

బోధనకు ఆటంకంగా మారిన యాప్‌లను రద్దు చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్‌ చేశారు.

యాప్‌లను రద్దు చేయాలని చెన్నూరు ఎంఈఓ కార్యాలయం వద్ద డిమాండ్‌ చేస్తున్న ఫ్యాప్టో లక్ష్మీరాజా తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్యాప్టో డిమాండ్‌ 

చెన్నూరు,  ఆగస్టు 18 : బోధనకు ఆటంకంగా మారిన యాప్‌లను రద్దు చేయాలని  ఫ్యాప్టో రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా డిమాండ్‌ చేశారు.  గురువారం చెన్నూరులో మండల విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ఆయన మాట్లాడుతూ ఈ కొత్త యాప్‌లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, వీటి వల్ల బోధనా సమయం వృథా అవుతోందన్నారు. విద్యాశాఖ అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో యాప్‌ల భారాన్ని తగ్గించాల్సిందిపోయి రోజుకో కొత్త యాప్‌ను జత చేయడం వల్ల అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారన్నారు. పర్యవేక్షణాధికారులను నియమించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా ఉపాధ్యాయుల సొంత మొబైల్‌ ఫోనలను ఉపయోగించి యాప్‌ల ద్వారా పర్యవేక్షిస్తామనడం నేల విడిచి సాము చేయడమేనన్నారు. నాడు పాఠశాలలకు మొబైల్‌ ఫోన్లను తీసుకువెళ్లవద్దన్న ప్రభుత్వం నేడు ప్రతి ఉపాధ్యాయుడు స్మార్ట్‌ఫోన పాఠశాలకు తీసుకెళ్లి ఉపాధ్యాయులు హాజరు నమోదు చేయాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వమే ఒక ఉద్యోగిని నియమించి ఎన్నిరకాల యాప్‌లు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖాదికారులు వెంటనే బోధనకు ఆటంకంగా మారిన యాప్‌లన్నీ రద్దు చేయాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో షాహిదుల్లా, రంగనాయకులు, శోభలత, సుశీల,  షకీల, మేరి, సునీత,  పెద్ద సిద్దయ్య, కాదర్‌బాషా, ఓబులేసు, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T05:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising