వైభవంగా అంకాళమ్మ జాతర
ABN, First Publish Date - 2022-04-19T05:10:07+05:30
కులమతాలకు అతీతంగా కొలిచే కొంగుబంగారం అంకాళమ్మ తల్లి జాతర సోమవారం అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకున్నారు.
ఖాజీపేట, ఏప్రిల్ 18: కులమతాలకు అతీతంగా కొలిచే కొంగుబంగారం అంకాళమ్మ తల్లి జాతర సోమవారం అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకున్నారు. మండల పరిధిలోని దుంపలగట్టు గ్రామంలో స్వయంభువుగా అంకాళమ్మ తల్లి మూలవిరాట్ వెలసి ఉంది. ఈ అమ్మవారికి మొక్కులు చెల్లిస్తే అంటురోగాలు దూరం అవడంతో పాటు పాడిపంటలకు పట్టిన చీడపీడలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. హిందువులు, ముస్లింలు ఈ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. బోనాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి అమ్మవారి దర్శనంకోసం భక్తులు భారీగా తరలి వచ్చారు.
Updated Date - 2022-04-19T05:10:07+05:30 IST