ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగరంగ వైభవంగా కొత్తపురమ్మ జాతర

ABN, First Publish Date - 2022-05-19T05:50:32+05:30

దుద్యాల గ్రామ దేవత కొత్తపు రమ్మ జాతర బుధవారం అంగరంగ వైభవంగా నిర్వ హించారు.

సంబేపల్లె: కొత్తపురమ్మ ఆలయం వద్ద నిర్వహించిన సిద్దల సాంగ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంబేపల్లె, మే 18:  దుద్యాల గ్రామ దేవత కొత్తపు రమ్మ జాతర బుధవారం అంగరంగ వైభవంగా నిర్వ హించారు. ఉదయం పుట్టబంగారం తెచ్చి కోనేటి స్నానాలు చేయించారు. అనంతరం పొంగుపాలు, నాణ్యములు ఎదురు రావడం కార్యక్రమాలు నిర్వ హించారు. మధ్యాహ్నం రెండు గంటలకు సిద్దల సాంగ్యం నిర్వహించారు. ఆసాదులతో అమ్మవారి చరిత్ర  వినిపించారు. బైనేనివారు గావుపిల్ల కార్యక్ర మం, అనంతరం అమ్మవారికి భక్తులు బోనాలు సమ ర్పించారు. రాత్రికి చాందినీ బండ్లు ఊరేగించారు. గురువారం ఉదయం అమ్మవారు సింహ వాహనం పై భక్తులకు దర్శనమివ్వనున్నారు. కల్లుపాటు కార్య క్రమంతో అమ్మవారి జాతర వైభవంగా ముగియ నుంది.
అట్టహాసంగా ఆరెమ్మ జాతర
సుండుపల్లె, మే18: సుండుపల్లెలో బుధవారం   ఆలయ ధర్మకర్తలు యర్రపురెడ్డి సుబ్బారెడ్డి, యర్రపురెడ్డి ఆరెంరెడ్డి ఆధ్వర్యంలో ఆరెమ్మ జాతర వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు, పూజలు, కుంకుమార్చన చేసి పట్టువస్త్రాలు, పుష్పాలతో అమ్మవారిని అలకరించారు. మంగళవారం రాత్రి నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పత్తివాండ్లపల్లె నుంచి ఆరెంరెడ్డి ఆధ్వర్యంలో మూడు చాందినీ బండ్లు, 10 ట్రాక్టర్లు బుధవారం తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన భజన ఆకట్టుకుంది. చాందినీ బండ్ల ఆలయ ప్రదర్శన అనంతరం ఆలయ ధర్మకర్తల కుటుంబ సభ్యులు బోనాలు, నైవేద్యం సమర్పించారు.

Updated Date - 2022-05-19T05:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising