ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నపూర్ణగా కటాక్షించిన అమ్మవారు

ABN, First Publish Date - 2022-10-01T05:18:51+05:30

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులను కటాక్షిం చారు.

మదనపల్లె పట్టణంలో అమ్మవారి అలంకరణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె అర్బన్‌, సెప్టెంబరు 30: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అన్నపూర్ణాదేవిగా అమ్మవారు భక్తులను కటాక్షిం చారు. పట్టణంలో వాసవీభవన్‌ వీధిలోని వాసవీ కన్యకా పరమేశ్వ రీదేవి ఆలయంలో ఆర్యవైశ్యసంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్పవాల ఐదవరోజు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరి దేవిగా అలంకరణ చేసి పూజ లు నిర్వహించారు. అమ్మవారిశాలల్లో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు పూనగంటి ఓంప్రకాష్‌, ట్రెజరర్‌ సూరేగిరిధర్‌, సెక్రటరీ దేవత సతీష్‌, ఆర్యవైశ్య మహిళాసంఘాల సభ్యులు మహిళలు, అధికసంఖ్యలో పాల్గొన్నారు.  పట్టణంలోని కోర్టు ఆవరణలో ఉన్న కోర్టులో గంగమ్మ ఆలయకమిటీ సభ్యులు మార్పురి సుధాకర్‌నాయుడు, మార్పురి నాగార్జునబాబు (గాంధీ)నీరుగట్టి ఆనందరెడ్డి, చైతన్యకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని అర్ధనారీశ్వరిగా ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. మహిళలు పొంగళ్లు నైవేధ్యంతో ఆలయానికి తరలి వచ్చి చీర, సారెను సమర్పించారు. నీరుగుట్టువారిపల్లెలో చౌడేశ్వరిదేవి ఆలయంలో చౌడేశ్వరీదేవిని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఉప్పు రామచం ద్ర, సెక్రటరీ గుండ్లపల్లె ప్రభాకర్‌, ట్రెజరర్‌ రామిశెట్టి లోకేష్‌ ఆధ్వర్యం లో సాయంత్రం అమ్మవారికి అన్నపూర్ణేశ్వరిదేవి అలంకరణచేసి ప్రత్యే కంగా పూజలు చేసి  భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయకమిటీ సభ్యులు, తొగటక్షత్రియసంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, అన్నమయ్య జిల్లాఅధ్యక్షుడు భోజనపు వెంకటనారాయణ, గౌరవా ధ్యక్షుడు మోడెం వెంకటరమణ, తొగట కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ శీలం రమణమ్మ రమేష్‌ బాబు, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆంజనేయస్వామి ఆలయకమిటి అధ్యక్షుడు పురాణం వెంకటరత్నం, సీటీఎం రోడ్డులోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో ఽధర్మకర్త పతాంజలీ స్వామి ఆధ్వర్యంలో అమ్మవారిని మహాలక్ష్మీగా ప్రత్యేకాలంకరణ చేసి పూజలు నిర్వహించారు. వరాల ఆంజనేయస్వామి ఆలయంలో  సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. చిప్పిలిగ్రామంలోని అయ్యప్పనగర్‌లో ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.  

Updated Date - 2022-10-01T05:18:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising