ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోధనలో సహకారం అందించేందుకే ‘సాల్ట్‌’

ABN, First Publish Date - 2022-08-05T04:46:22+05:30

బోధనలో ఉపాధ్యాయులకు సహాయ సహకారాలు అం దించేందుకు వరల్డ్‌ బ్యాంక్‌, ఎస్‌సీఈఆర్‌టీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే సాల్ట్‌ (సపో ర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌) ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రాంతీయ సంచాలకులు కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పలి దేవరాజు, సమగ్ర శిక్ష పీడీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్లాస్‌ రూమ్‌ అబ్జర్వేషన్‌పై ప్రత్యేక  శిక్షణ 

ఆర్‌జేడీ, డీఈఓ, ఎస్‌ఎస్‌ ఏపీఎసీ 

కడప(ఎడ్యుకేషన్‌), ఆగస్టు 4: బోధనలో ఉపాధ్యాయులకు సహాయ సహకారాలు అం దించేందుకు వరల్డ్‌ బ్యాంక్‌, ఎస్‌సీఈఆర్‌టీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టే సాల్ట్‌ (సపో ర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌) ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ప్రాంతీయ సంచాలకులు కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పలి దేవరాజు, సమగ్ర శిక్ష పీడీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. క్లాస్‌ రూమ్‌ అబ్జర్వేషన్‌పై ఇస్తున్న ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కడప నగరం మున్సిపల్‌ హైస్కూల్‌ మెయిన్‌లో గురువారం సాల్ట్‌ తొమ్మిది రోజుల శిక్షణలో వారు మాట్లాడుతూ సాల్ట్‌ ప్రోగ్రాం ఉపాధ్యాయులకు బోధనా అభ్యసన ప్రక్రియలో ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన శిక్షణ అని పేర్కొన్నారు.

శిక్షణ అనంతరం శిక్షక ప్రధానోపాధ్యాయులు సీఆర్పీలు పాఠశాల పర్యవేక్షణ సమయంలో తరగతి గదిని పర్యవేక్షించాలని ఉపాధ్యాయులకు అవసరమైన సహాయ సహకారాలు సూచనలు అందించాలన్నారు. అనంతరం మాస్టర్‌ ట్రైనర్స్‌ శిక్షణ అందించారు. సమగ్ర శిక్షణ ఏఎంఓ ధనలక్ష్మి, ఏఏఎంఓ రామాంజనేయులు,రెడ్డి, ఏఏఎల్‌ఎస్‌ దసరథరామిరెడ్డి, ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్లు (సీఆర్పీ)లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-05T04:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising