ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నీ మభ్యపెట్టే మాటలే...

ABN, First Publish Date - 2022-01-20T04:47:25+05:30

ప్రొద్దుటూరు అభివృద్ధికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని, దోమలు లేకుండా చేసి, ఆరోగ్య ప్రొద్దుటూరుగా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పదేపదే చెబుతుంటారని, ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టే మాటలే అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌ అన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 19 : ప్రొద్దుటూరు అభివృద్ధికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని, దోమలు లేకుండా చేసి, ఆరోగ్య ప్రొద్దుటూరుగా చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పదేపదే చెబుతుంటారని, ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టే మాటలే అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వీఎస్‌ ముక్తియార్‌ అన్నారు. వైసీపీ రెండున్నర ఏళ్ల కాలంలో అనారోగ్య ప్రొద్దుటూరుగా తయారైందని ఆయన విమర్శలు చేశారు. బుధవారం టీబీ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముక్తియార్‌ మాట్లాడుతూ జనవరి 1 నుంచి ఈ రోజు వరకు ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి రెండు వేలకు పైగా జ్వరాల కేసులు వచ్చాయన్నారు. ఇక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో జ్వరపీడితుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందన్నారు. పురపాలికలో 41 కౌన్సిల్‌ స్థానాల్లో 40 స్థానాల్లో వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారని, వీరికి పట్టణంలో పారిశుధ్యంపై శ్రద్ధ లేదన్నారు. ప్రొద్దుటూరులో వైసీపీ దౌర్జన్యాలు, దోపిడీలు, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయన్నారు. సమావేశంలో టీడీపీ కడప పార్లమెంట్‌ అధికార ప్రతినిధి దస్తగిరి, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్‌,  ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T04:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising