ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామీలు గుప్పించి.. గాలికొదిలేసిన సీఎం!

ABN, First Publish Date - 2022-10-18T04:42:10+05:30

ఎన్నికలకు ముందు సాఽధ్యం కాని హామీలను గుప్పించి అధికారం చేపట్టాక, వాటిని అమలు చేయడంలో జగన్‌ ఘోరంగా విఫలమయ్యాడని నియోజకవర్గ టీడీపీ యువనేత కె.రితేష్‌కుమార్‌రెడ్డి విమ ర్శించారు.

బాదుడే బాదుడు కార్యక్రమంలో కరపత్రాలు అందజేస్తున్న రితేష్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ పాలనలో పేదలు బ్రతికే పరిస్థితి లేదు 

బాదుడే బాదుడు కార్యక్రమంలో రితేష్‌కుమార్‌రెడ్డి 

బద్వేలు, అక్టోబరు 17: ఎన్నికలకు ముందు సాఽధ్యం కాని హామీలను గుప్పించి అధికారం చేపట్టాక,  వాటిని అమలు చేయడంలో జగన్‌ ఘోరంగా విఫలమయ్యాడని  నియోజకవర్గ టీడీపీ యువనేత కె.రితేష్‌కుమార్‌రెడ్డి విమ ర్శించారు. సోమవారం మండలంలోని నందిపల్లె, వనంపుల, కొత్తచెరువు, బాలాయపల్లె, కోనసముద్రం, తిప్పనపల్లె గ్రామ పంచాయతీల్లో  బాదుడే బాదు డు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి   కరపత్రాలను పంపిణీ చేశారు. నిత్యావసరాలు, గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరలు, ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెంచి పేద ప్రజలు బతికే పరిస్థితి లేకుండా చేస్తోందన్నారు.   ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడుతున్న టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గ చర్య అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలని పిలుపుని చ్చారు.  బద్వేలు పట్టణ టీడీపీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు బసిరెడ్డి రవికుమార్‌రెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి మిత్తికాయల రమణయ్య యాదవ్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు  మణ్యం రామి రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కొంకుల రాంబాబు, జహంగీర్‌బాష, ఐలయ్య, దానం తది తరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-18T04:42:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising