ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరాల్చి

ABN, First Publish Date - 2022-10-18T05:24:01+05:30

ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అత్యంత వెనుకబడిన వాల్మీకి (బోయ)లను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి సంఘం నేతలు మండ్ల భక్తవత్సలం, వీఆర్‌పీఎస్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గువ్వల యోగానందబాబులు డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట దీక్ష చేస్తున్న వాల్మీకి సంఘం నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ కార్యాలయం ఎదుట వాల్మీకి సంఘం నేతల దీక్ష

రాయచోటిటౌన్‌, అక్టోబరు 17: ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అత్యంత వెనుకబడిన వాల్మీకి (బోయ)లను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి సంఘం నేతలు మండ్ల భక్తవత్సలం, వీఆర్‌పీఎస్‌ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గువ్వల యోగానందబాబులు డిమాండ్‌ చేశారు. వాల్మీకిసంఘం రాష్ట్ర నాయకుడు పెనుగొండ ఈశ్వరయ్య విజయవాడలో చేపట్టిన దీక్షకు మద్దతుగా సోమవారం అన్నమయ్య జిల్లా వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట వాల్మీకులంతా కలిసి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ వాల్మీకి సంఘం కడప అధ్యక్షుడు భోగ్యం వెంకట్రమణ, రామచంద్ర, నారాయణలు ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం భోగ్యం వెంకట్రమణ మాట్లాడుతూ 1956 నుంచి వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉండేవారని, కాలక్రమేణ ప్రభుత్వాలు బీసీల్లో చేర్చడం జరిగిందన్నారు. పక్క రాష్ర్టాల్లో వాల్మీకులు ఎస్టీ జాబితాలో ఉన్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాయచోటి వాల్మీకి సంఘం అధ్యక్షుడు భక్తవత్సలం, మన్‌మోహన్‌, రామచంద్ర, బండపల్లె మల్లికార్జున, మహిళా కార్యదర్శి నాగమణి, గువ్వల బాలాజీ, మండ్ల మహేష్‌, సాయి, భోగ్యం నాగేంద్ర, మండ్ల సూరి, గువ్వల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising